Nara Lokesh: నెల్లూరు నగరంలో ఓ హృదయాన్ని కదిలించే సంఘటన జరిగింది. రోజూ రోడ్ల మీద భిక్షాటన చేసే ఇద్దరు చిన్నారులు – పెంచలయ్య, వెంకటేశ్వర్లు… ‘‘సారూ! మాకూ చదువు చెప్పండి’’ అంటూ నేరుగా కమిషనర్ వద్దకు వెళ్లి కోరారు. వారి ఈ వేడుక ప్రజలను కలిచివేసింది. ఈ ఘటనపై ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పందించారు.
ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనాన్ని చూసిన లోకేష్ వెంటనే స్పందించి, ఆ ఇద్దరు చిన్నారుల చదువు కోసం అన్నీ ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ‘‘పేదరికం నుంచి బయటపడటానికి విద్యే సాధనం. చదువుతోనే జీవితంలో ముందుకు వెళ్లొచ్చు. ఆ చిన్నారులు తమ కలలను నెరవేర్చుకోవడానికి మేము అన్నివిధాల సహాయం చేస్తాం,’’ అని లోకేష్ తెలిపారు.
అంబేద్కర్ కోనసీమకు చెందిన శ్రీకాంత్‌కు రూ.9 లక్షల సాయం
అంతేకాకుండా, అంబేద్కర్ కోనసీమ జిల్లా వెంకటరామ శ్రీకాంత్ అనే యువకుడి పరిస్థితి కూడా మంత్రి లోకేష్ దృష్టికి వెళ్లింది. రోజూ కూలీకి వెళ్లి బతికే శ్రీకాంత్ అనారోగ్యంతో మంచానికి పరిమితమయ్యాడు. అతని తండ్రికీ అనారోగ్యం కావడంతో ఆ కుటుంబం పూర్తిగా కష్టాల్లో పడింది.
చికిత్సకు రూ.9 లక్షలు కావాలన్న విషయం సోషల్ మీడియా ద్వారా తెలిసిన వెంటనే మంత్రి లోకేష్ స్పందించారు. వీలైనంత త్వరగా సాయం అందిస్తామని హామీ ఇచ్చారు.
నెల్లూరు విఆర్ స్కూలు వద్ద పెంచలయ్య, వెంకటేశ్వర్లు అనే ఇద్దరు చిన్నారులు తమకు చదువు చెప్పించాలని కమిషనర్ ను ప్రాధేయపడటం నన్ను కదిలించింది. ఆ చిన్నారుల విద్యాభ్యాసానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాల్సిందిగా అక్కడి అధికారులను ఆదేశించాను. పేదరికం నుంచి బయటకు తెచ్చే ఒకే ఒక్క సాధనం…
— Lokesh Nara (@naralokesh) July 5, 2025