Jai Sri Ram Price: సాధారణంగా పంట చేతికొచ్చే టైమ్‌లో రేట్లు పడిపోయి రైతన్నలు ఆందోళన చెందడం చూస్తుంటాం. కానీ ఉమ్మడి వరంగల్ జిల్లా మార్కెట్లలో మాత్రం ప్రస్తుతం సీన్ పూర్తిగా రివర్స్ అయ్యింది! మార్కెట్‌కు తీసుకొచ్చిన ప్రతి గింజా బంగారమై మెరుస్తోంది. ముఖ్యంగా మార్కెట్లో సన్న బియ్యం కొరత, బ్రాండెడ్ కంపెనీల డిమాండ్ నేపథ్యంలో సన్నధాన్యంతో పాటు పత్తి, మొక్కజొన్న పంటలకు వ్యాపారులు పోటీపడి వేలం పాడుతుండటంతో ధరలు సరికొత్త రికార్డులను తాకుతున్నాయి. క్వింటాలుకు ఊహించని రీతిలో భారీ ధరలు దక్కుతుండటంతో మార్కెట్లకు వస్తున్న రైతుల మొహాల్లో ఆనందం వెల్లివిరుస్తోంది.
మహబూబాబాద్‌లో ‘జైశ్రీరాం’ ధాన్యం హవా!
జైశ్రీరాం సన్నధాన్యం: క్వింటాలుకు గరిష్ఠంగా ఏకంగా రూ. 5,555 లభించగా, కనిష్ఠ ధర రూ. 3,960గా నమోదైంది. వ్యాపారులు సగటున రూ. 5,080 చొప్పున భారీగా కొనుగోలు చేశారు.
ఆర్ఎన్ఆర్ (RNR) రకం: క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 4,885 ధర పలికింది.
హెచ్ఎంటీ (HMT) రకం: గరిష్ఠ ధర రూ. 4,930 వద్ద ట్రేడ్ అయింది.
పత్తి: మహబూబాబాద్ మార్కెట్లో పత్తి క్వింటాలుకు గరిష్ఠంగా రూ. 9,021 పలకగా, కనిష్ఠ ధర రూ. 5,300 వద్ద నమోదైంది. తొమ్మిది వేల మార్కును దాటడంతో పత్తి రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మొక్కజొన్న: మహబూబాబాద్‌లో క్వింటాలు గరిష్ఠంగా రూ. 3,051 (కనిష్ఠ ధర రూ. 2,000) పలికింది.
ఏనుమాముల మార్కెట్ రికార్డ్: ఆసియాలోనే ప్రసిద్ధి చెందిన వరంగల్ ఏనుమాముల మార్కెట్లో వ్యాపారుల తీవ్ర పోటీ నడుమ మొక్కజొన్న క్వింటాలుకు గరిష్ఠంగా ఏకంగా రూ. 3,255 ధర పలికి రైతులకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.
కేసముద్రం మార్కెట్లోనూ గట్టి పోటీ..
ఎందుకు ఇంత డిమాండ్? నిపుణుల విశ్లేషణ..
