Aadarsha Kutumbam Ak 47: విక్టరీ వెంకటేష్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో సినిమా అంటేనే ఆడియన్స్‌లో వైబ్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ లాంటి ఎవర్ గ్రీన్ క్లాసిక్స్‌కు మాటలు అందించిన త్రివిక్రమ్, తొలిసారి వెంకీని డైరెక్ట్ చేస్తుండటంతో ‘ఆదర్శ కుటుంబం AK 47’ అనౌన్స్ అయినప్పటి నుంచే భారీ హైప్ క్రియేట్ అయింది.
హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌లో చినబాబు నిర్మించిన ఈ ప్రాజెక్ట్ వరుస వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ క్రేజీ కాంబో థియేటర్లలో ఏ మేరకు మెప్పించింది? వెంకీ మామ ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఏ రేంజ్‌లో నవ్వించాడో రివ్యూలో చూద్దాం!
మూవీ డీటెయిల్స్..
అసలు కథేంటంటే?
హాస్పిటల్‌లో ఉద్యోగం చేసే చిట్టిబాబు (వెంకటేష్) ఒక టిపికల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెన్. భార్య స్వర్ణ (శ్రీనిధి శెట్టి) చిట్టీల పాటలో రూ.4 లక్షలు నష్టపోవడం, కొడుకు సర్వ (ప్రజ్వల్) ఆపరేషన్‌కు రూ.2 లక్షలు అవసరం పడటంతో ఆర్థిక ఇబ్బందుల్లో సతమతమవుతుంటాడు. అలాంటి టైమ్‌లో అనుకోకుండా కొన్న ఒక లాటరీ టికెట్ ద్వారా ఈ కుటుంబానికి ఏకంగా రూ. 100 కోట్లు వచ్చి పడతాయి!
ఆకస్మికంగా వచ్చిన సిరిసంపదలతో చిన్న కాలనీ నుంచి ఓ విలాసవంతమైన లగ్జరీ గేటెడ్ కమ్యూనిటీ విల్లాలోకి వీరు షిఫ్ట్ అవుతారు. అయితే, అన్ని రాష్ట్రాలు తిరుగుతూ తెలంగాణలోకి ఎంటర్ అయిన ఒక ప్రమాదకరమైన బీహార్ డెకాయిట్ గ్యాంగ్.. చిట్టిబాబు ఫ్యామిలీకి దక్కిన రూ.100 కోట్లపై కన్నేస్తుంది. ఆ డబ్బును కొట్టేసేందుకు ఆ గ్యాంగ్‌కు చెందిన నీలా (దేవియాని శర్మ), ఆమె తమ్ముడు పింటూ అదే ఇంట్లో పనిమనుషులుగా చేరతారు. ఒక రాత్రి ఆ ఇంట్లోకి చొరబడి డబ్బు కొట్టేయాలని ప్లాన్ వేస్తారు.
ఈ క్రమంలో అప్పటివరకు అమాయకంగా కనిపించిన చిట్టిబాబు కుటుంబం ఆ ప్రమాదాన్ని ఎలా ఎదుర్కొంది? ఇన్నోసెంట్‌గా ఉండే చిట్టిబాబు ఒక్కసారిగా వైలెంట్‌గా ఎందుకు మారాల్సి వచ్చింది? ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న ఎస్పీ దామోదర్ నాయుడు (నారా రోహిత్), డీఎస్పీ బృహస్పతి (రావు రమేష్), చిత్తరంజన్ (సత్య) పాత్రల ప్రాధాన్యత ఏంటి? అనేది తెరపై చూడాల్సిందే!
విశ్లేషణ: ఎలా ఉందంటే?
త్రివిక్రమ్ తన రెగ్యులర్ శైలికి భిన్నంగా కాస్త క్రైమ్-కామెడీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌ను టచ్ చేస్తూ ఈ కథను రాసుకున్నారు.
ఫస్ట్ హాఫ్: సినిమా ప్రారంభంలో వెంకీ మార్క్ మిడిల్ క్లాస్ తిప్పలు, భార్యాభర్తల మధ్య గిల్లికజ్జాలు చాలా లైట్‌హార్టెడ్‌గా సాగిపోతాయి. రూ.100 కోట్ల లాటరీ తగలడం కాస్త సినిమాటిక్ లాజిక్‌లెస్ అనిపించినా.. వెంకటేష్ – కమెడియన్ సత్య మధ్య వచ్చే సీన్లు థియేటర్లలో నవ్వులు పూయిస్తాయి. ప్రీ-ఇంటర్వెల్ వరకు వచ్చే సన్నివేశాలు, ఊహించని యాక్షన్ బ్లాక్, ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయే ట్విస్ట్‌తో ముగుస్తుంది. గతంలో లాజిక్‌లెస్ అనిపించిన విషయాలకు ఇంటర్వెల్ వద్ద సరైన జస్టిఫికేషన్ ఇచ్చి దర్శకుడు మంచి క్యూరియాసిటీని క్రియేట్ చేశారు.
సెకండ్ హాఫ్: ఇంటర్వెల్ ఇచ్చిన కిక్ సెకండ్ హాఫ్‌లో కాస్త నెమ్మదిస్తుంది. డెకాయిట్ గ్యాంగ్ నుంచి కుటుంబాన్ని కాపాడుకునే క్రమంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్స్ కాస్త రొటీన్‌గా, సాగదీసినట్లు అనిపిస్తాయి. స్క్రీన్‌ప్లే వేగం మందగించినప్పటికీ.. వెంకీ మామ వింటేజ్ ఎనర్జీ, కొన్ని చోట్ల త్రివిక్రమ్ మార్క్ వన్‌లైనర్లు సినిమాను నిలబెట్టే ప్రయత్నం చేశాయి. పోలీసులతో సాగే ఇన్వెస్టిగేషన్ సీన్లు కొన్ని ఆసక్తికరంగా ఉన్నా, భావోద్వేగాలు పూర్తిస్థాయిలో పండలేదనే భావన కలుగుతుంది.
ఎవరెలా చేశారంటే?
టెక్నికల్ అంశాలు
ప్లస్ పాయింట్లు..
మైనస్ పాయింట్లు..
బాటమ్ లైన్
భారీ అంచనాలు పెట్టుకోకుండా, వింటేజ్ వెంకీ మామ మార్క్ కామెడీని ఎంజాయ్ చేయాలనుకునే వారికి ‘ఆదర్శ కుటుంబం AK 47’ ఈ వీకెండ్‌లో సరదాగా టైమ్ పాస్ చేసే మంచి ఫ్యామిలీ ఛాయిస్!
