Vishwambhara: సంక్రాంతి కానుకగా రావాల్సిన మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ మూవీ వాయిదా పడి… ఆ డేట్ లోకి రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ వచ్చి చేరింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను శివరాత్రి కానుకగా ఫిబ్రవరిలో అయినా విడుదల చేస్తారని మెగాభిమానులు ఆశపడ్డారు. అయితే వారికి కోరిక ఫలించే పరిస్థితి కనిపించడం లేదు. ‘విశ్వంభర’ మూవీ టీజర్ లోని వీఎఫ్ఎక్స్ వర్క్ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో నెగెటివ్ రిమార్క్ వచ్చింది.
ఇది కూడా చదవండి: OTT Platform: సరికొత్త ఓటీటీ ప్లాట్ ఫామ్..ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తుంది!
Vishwambhara: దాంతో టోటల్ గా వీఎఫ్ ఎక్స్ సమకూర్చుతున్న సంస్థనే మార్చేయాలనే నిర్ణయానికి మేకర్స్ వచ్చారట. ఈ కారణంగా సినిమా అనుకున్నదానికంటే ఆలస్యం అవుతుందని, ఏకంగా సమ్మర్ కే వస్తుందని తెలుస్తోంది. అయితే ఏప్రిల్ 28న పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ రిలీజ్ అవుతున్న దృష్ట్యా దానితో క్లాష్ కాకుండా ‘విశ్వంభర’ వచ్చే ఆస్కారం ఉంది.
కార్తీక్ ఆర్యన్ సరసన శ్రీలీల!
Sri Leela: ఉత్తరాది భామలు దక్షిణాది చిత్రాలపై ఆసక్తి కనబరుస్తుంటే.. ఇక్కడి వారు ఉత్తరాది చిత్రాలలో నటించాలని తహతహలాడుతున్నారు. అందుకు శ్రీలీల కూడా మినహాయింపు కాదు. ఆమె తాజాగా ఓ హిందీ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారనే వార్తలు ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. బాలీవుడ్ యాంగ్ హీరో కార్తీక్ ఆర్యన్ ‘తు మేరీ మై తేరా… మై తేరా తు మేరీ’ అనే మూవీ చేయబోతున్నాడు. ధర్మ ప్రొడక్షన్స్ పతాకంపై కరణ్ జోహార్ దీనిని నిర్మిస్తున్నాడు. సమీర్ విద్వాన్స్ డైరెక్ట్ చేయబోతున్నారు. ఈ సినిమాలో కార్తీక్ ఆర్యన్ సరసన శ్రీలీల హీరోయిన్ గా నటించబోతోందట. దీనికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, ఒకసారి అగ్రిమెంట్ పూర్తి అయిన తర్వాత అధికారికంగా దీనిని ప్రకటిస్తారని అంటున్నారు.