Maha Vamsi Saval: రాష్ట్రం అభివృద్ధి, సమాజం బాగు, పీడిత వర్గాల అభ్యున్నతి, మహిళల గౌరవ మర్యాదల కోసం రాజీపడని నైజం మా ఇజం.. అదే మహాన్యూస్ కట్టుబడిన సిద్ధాంతం.. అని మరోసారి నిరూపించారు మహా వంశీ. దిగజారుతున్న జర్నలిజం.. అదే వ్యవస్థలో మనమూ ఉన్నాం.. ఏం చేద్దాం.. అని సరిపెట్టుకోలేదు. బరితెగించిన బానిసలచేత, మదమెక్కిన మూకలచేత అవమానించబడ్డ మహిళా సమాజానికి ప్రశ్నించే గొంతుకగా నిలిచారు. మహాన్యూస్ ఒక్కసారి దేన్నైనా టేకప్ చేస్తే… బాధితల పక్షాన ఎంతవరకైనా వెళ్తుందని మరోసారి స్పష్టం చేశారు మహా వంశీ.
తప్పు చేశారు, తప్పుడు మాటలు మాట్లాడారు.. అంతటితో ఆగక.. తమ తప్పే లేదని నిస్సిగ్గుగా సమర్థించుకుంటున్నారు. లేని విషయాన్ని ఉన్నట్లు భ్రమింపజేయాలని పదేపదే పచ్చి అవాస్తవాలు వల్లె వేస్తున్నారు. జర్నలిజం చచ్చింది.. మనం ఏం చేసినా, ఏం మాట్లాడినా చెల్లుతుంది అని భావించిన ఆ దుష్టద్వయానికి, వారికి వేదిక కల్పించి నికృష్టాలు మాట్లాడించిన సదరు మీడియా హౌస్‌కు తన సవాల్‌తో చెంప చెల్లుమనిపించారు మహా వంశీ. సాక్షి టీవీ డిబేట్‌లో సీనియర్ జర్నలిస్టునని చెప్పుకునే కృష్ణంరాజు మాట్లాడిన “వేశ్యా రాజధాని” వ్యాఖ్యలకు, చిడతలు వాయిస్తూ ఆ వ్యాఖ్యల్ని సమర్థించిన మరో సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని శ్రీనివాస్‌కు.. అసలు ఆ వ్యాఖ్యలు చేయడానికి ఆధారాలేంటి అని పరిశీలిస్తే.. దానికి మూలం జూన్ 2న టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన ఆర్టికల్ అని తెలుస్తోంది. అయితే ఆ ఆర్టికల్‌ని, అందులో ఉన్న కంటెంట్‌ని పూర్తిగా ట్విస్ట్ చేసి, ప్రజల్ని మిస్ లీడ్ చేశారని స్పష్టమౌతోంది. ఎందుకంటే సదరు టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్‌లో ఎక్కడా “అమరావతి” పేరు లేదు.
Also Read: Sakshi Conspiracy: పక్కా సమాచారంతోనే పవన్ ఆ ప్రకటన చేశారా?
Maha Vamsi Saval: అయితే పదే పదే ఆ ఇద్దరు.. ఆ ఆర్టికల్‌నే చూపిస్తూ వచ్చారు. తమ తప్పుని సమర్థించుకునే ప్రయత్నం చేశారు. వారి సమర్థింపులో సత్యం వీసమెత్తు కూడా లేదని ప్రజలకు బలంగా తెలియజేయాల్సిన అవసరం, ఆవశ్యకతని మహా వంశీ గుర్తించారు. టైమ్స్ ఆఫ్ ఇండియా ఆర్టికల్‌లో ఎక్కడైనా సరే.. అమరావతి అనే పదం ప్రస్తావించి ఉన్నట్లు కానీ, అమరావతి ప్రాంతంలో, అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో వేశ్యలు ఎక్కువగా ఉన్నారని పేర్కొన్నట్లు కానీ నిరూపిస్తే.. తన మహాన్యూస్ చానల్‌ని మూసివేస్తానని సవాల్ చేశారు చానల్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వంశీకృష్ణ మారెళ్ల. నిరూపించలేని పక్షంలో సాక్షి ఛానల్‌ని మూసేస్తారా అంటూ నిలదీశారు.
మహా వంశీ చేసిన ప్రయత్నం ఇంపాక్ట్ ఏ విధంగా ఉందన్న దానికి నిదర్శనం.. సోషల్‌మీడియాలో వైరల్ అవుతున్న ఈ పోస్టింగులే. పదే పదే ఒక అబద్దాన్ని మాట్లాడి, నిజం చేయాలని ప్రయత్నించిన వారికి.. దమ్మున్న జర్నలిజంతో అడ్డుకట్టగా నిలిచారు మహా వంశీ.