Viral News:ఏటేటా భక్తుల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. ఈ ఏడాది ఒకటి కాదు రెండు కాదు అరకోటికి పైగా భక్తులు ఆ స్వామిని దర్శించుకున్నారు. ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇంతకూ ఏ దేవుడు.. ఏ ఆలయం చెప్పనేలేదు కదూ.. అదేనండి శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం.
Viral News:కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయాన్ని జనవరి 20న ఉదయం మూసివేసినట్టు ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అధికారులు ప్రకటించారు. ఆనవాయితీ ప్రకారం.. పందళం రాజకుటుంబ ప్రతినిధి త్రికేత్తనాల్ రాజరాజ వర్మ అయ్యప్ప దర్శనం చేసుకున్న తర్వాత ఆలయాన్ని మూసివేసినట్టు వెల్లడించారు.
Viral News:మకర విళక్కు వార్షిక పూజల సందర్భంగా 2024 నవంబర్ 16న శబరిమల అయ్యప్ప ఆలయం తెరుచుకున్నది. ఆ తర్వాత నుంచి సోమవారం నాటి వరకు వరుసగా వచ్చిన ఈ 53 లక్షల మందికిపైగా అయ్యప్ప మాలధారులు, ఇతర భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి వచ్చిన హుండీ, కట్న కానుకల వివరాలను దేవస్థాన బోర్డు వెల్లడించలేదు. త్వరలో లెక్కించనున్నట్టు తెలిసింది.