Vikarabad: రోజులానే తిన్నాడు..పడుకున్నాడు. కాని తెల్లవారేసరికి చనిపోయాడు. అందరూ అలానే అక్కడ తిని పడుకున్నా..ఆ విద్యార్ధి మాత్రమే చనిపోయాడు. కారణం ఏంటి ? ఇప్పుడు ఇదే తెలియాలి. అక్కడ ఉన్న విద్యార్థులు ఒకరకంగా చెబుతుంటే …మరి కొందరు మరో రకంగా చెబుతున్నారు. ఎవరు ఏది చెప్పినా …నిజం ఐతే బయటకు రావాలి. ఎందుకంటే ప్రాణాలు పోయింది పడవ తరగతి చదివే బాలుడిది…
కుల్కచర్ల గిరిజన వసతి గృహం విద్యార్థి అనుమానస్పదంగా మృతి చెందాడు. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని గిరిజన బాలుర వసతి గృహంలో వికారాబాద్ మండలం మద్గుల్ చిట్టెంపల్లి తండాకు చెందిన నేనావత్ దేవేందర్ పదవ తరగతి చదువుతున్నాడు. రోజు లాగానే రాత్రి తిని, టీ తాగి పడుకున్న విద్యార్థి తెల్లారినా లేవకపోవడంతో పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దేవేందర్ కొన్ని గంటల ముందే మృతి చెందినట్టు వైద్యులు నిర్దారించారు.
సంఘటన స్థలానికి వార్డెన్ సురేందర్ రాకపోవడంతో వసతి గృహంలో ఏదో జరిగిందని అనుమానం వ్యక్తం అవుతుందని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పరిగి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద విద్యార్థి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారి కమలాకర్ రెడ్డి పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకొని విద్యార్థి మృతికి గల కారణాలు తెలుసుకున్నారు.
విద్యార్థి నేనావత్ దేవెందర్ ని పరిగి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చే సరికి కొన్ని గంటల ముందే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తేనే మృతికి గల కారణం తెలుస్తుందన్నారు.