Ram Charan: ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ 16 వ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే సుకుమార్‌తో సినిమా మొదలు పెట్టనున్నాడు. ఇక ఆ తర్వాత చరణ్ ఎవరు ఊహించని దర్శకులను లైన్లో పెడుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ‘హాయ్ నాన్న’ దర్శకుడు శౌర్యువ్ చెప్పిన కథకు ఓకె చెప్పాడనే టాక్ ఉండగా ఇప్పుడు బాలీవుడ్ డైరెక్టర్‌తో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తుంది. బాలీవుడ్‌లో ‘కిల్’ అనే మూవీ చిన్న సినిమాగా విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాకు నిఖిల్ నగేశ్ భట్ దర్శకత్వం వహించాడు. యాక్షన్ థ్రిల్లర్‌గా వచ్చిన ఈ చిత్రంలో యాక్షన్ సీన్స్‌కి బాలీవుడ్ ప్రేక్షకులే కాదు తెలుగు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. ఇప్పుడు నిఖిల్ నగేశ్ భట్‌తో చరణ్ సినిమా చేయబోతున్నాడనే టాక్ నడుస్తోంది. గత కొద్ది నెలలుగా ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నాయట. ఇది నిఖిల్ నగేశ్ భట్ డ్రీమ్ ప్రాజెక్ట్ అని, మైథాలాజికల్ మూవీగా రాబోతున్నట్టుగా బాలీవుడ్ వర్గాల సమాచారం. ఇందులో నిజమెంత ఉందో తెలీదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింటా తెగ వైరల్ అవుతుంది.