Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస చిత్రాల్లో నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే మారుతి డైరెక్షన్‌లో ‘ది రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్న ప్రభాస్, హను రాఘవపూడి దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాకు ఫౌజీ అనే టైటిల్ పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ ఓ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. కాగా, తాజాగా ఫౌజీ మూవీలోని ప్రభాస్ లుక్ రివీల్ అయ్యింది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. దీనికి సంబంధించి ఆయన తాజాగా ఫౌజీ సెట్స్‌లో జాయిన్ అయ్యారు. ఫౌజీ సెట్స్ నుంచి అనుపమ్ ఖేర్ కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ప్రభాస్, దర్శకుడు హను రాఘవపూడి, డిఓపి సుదీప్ చటర్జీ కూడా ఉన్నారు. దీంతో ప్రభాస్ అభిమానులు ఈ ఫోటోలను నెట్టింట వైరల్ చేస్తున్నారు.