Vijayendra Prasad: ఇండియన్ సినిమాలో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ రైటర్ అలాగే ‘బాహుబలి’, ‘ఆర్ఆర్ఆర్’, ‘భజరంగీ భాయిజాన్’ వంటి పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్లకు ప్రాణం పోసిన రైటర్ వి. విజయేంద్ర ప్రసాద్ మరో భారీ ప్రాజెక్ట్‌కు కథని అందించనున్నట్లు తెలుస్తోంది. వెర్సటైల్ యాక్టర్ ధనుష్ హీరోగా తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ జంగిల్ అడ్వెంచర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు, నిర్మాత సంజయ్ లీలా భన్సాలీ అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుండగా, ‘ఇరుంబు తిరై’ (అభిమన్యుడు), ‘సర్దార్’ సినిమాల ఫేమ్ పీఎస్ మిత్రన్ దర్శకత్వం వహించనున్నారు.
ఈ విషయాన్ని స్వయంగా చెప్పిన దర్శకుడు పీఎస్ మిత్రన్..
గత కొద్ది నెలలుగా ఈ ప్రాజెక్ట్‌పై ఇండస్ట్రీలో చర్చలు సాగుతుండగా, తాజా ఇంటర్వ్యూలో దర్శకుడు పీఎస్ మిత్రన్ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమా దట్టమైన అడవుల నేపథ్యంలో సాగే భారీ మైథలాజికల్ అడ్వెంచర్ (పౌరాణిక ఫాంటసీ) సినిమా అని క్లారిటీ ఇచ్చారు.
మిత్రన్ బాలీవుడ్ ఎంట్రీ..
తమిళంలో కొత్త కథాంశాలతో వచ్చి విజయాలు అందుకున్న పీఎస్ మిత్రన్‌కు ఇది హిందీలో డెబ్యూ సినిమా కావడం విశేషం. ఇంతటి భారీ బడ్జెట్, బిగ్ స్టార్స్ ఉన్న సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతుండటంతో సినిమాపైన అంచనాలు పెరుగుతున్నాయి.
ఇండియన్ సినిమా మోస్ట్ క్రేజీ కొలాబరేషన్..
జాతీయ స్థాయి నటుడు ధనుష్ లీడ్ రోల్ పోషించడం, భన్సాలీ వంటి ప్యాషనేట్ ఫిల్మ్ మేకర్ నిర్మించడం, వీరికి తోడుగా విజయేంద్ర ప్రసాద్ అద్భుతమైన కథను సమకూరుస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు తారాస్థాయికి చేరాయి. భారతీయ సినీ రంగంలో ఇటీవల కాలంలో అత్యంత భారీ కొలాబరేషన్లలో ఒకటిగా నిలవనుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
మహేష్ బాబు ‘వారణాసి’ తర్వాత మరో సంచలనం..
ప్రస్తుతం తన కుమారుడు ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న గ్లోబ్ ట్రాటింగ్ యాక్షన్ అడ్వెంచర్ సినిమా ‘వారణాసి’కి విజయేంద్ర ప్రసాద్ కథను అందించిన విషయం తెలిసిందే. ఆ భారీ సినిమా కొనసాగుతుండగానే ధనుష్-భన్సాలీ ప్రాజెక్ట్‌ను లాక్ చేయడం ఆయన కథల డిమాండ్‌ను మరోసారి నిరూపిస్తోంది.
అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసేలా రూపొందుతున్న ఈ ఎపిక్ మైథలాజికల్ జంగిల్ సాగాకు సంబంధించిన పూర్తి తారాగణం, టెక్నికల్ టీమ్ వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.
