Vere Level Office: ప్రముఖ దర్శకుడు ఇ. సత్తిబాబు రూపొందించిన వెబ్ సీరిస్ ‘వేరే లెవెల్ ఆఫీస్’. ఆర్జే కాజల్, అఖిల్ సార్థక్, శుభశ్రీ, మిర్చి కిరణ్, రీతు చౌదరి తదితరులు కీలక పాత్రలు పోషించిన ఈ వెబ్ సీరిస్ ను వరుణ్ చౌదరి గోగినేని నిర్మించారు. డిసెంబర్ 12న ఆహాలో స్ట్రీమింగ్ కాబోతున్న ఈ వెబ్ సీరిస్ ట్రైలర్ ను రామానాయుడు స్టూడియోలో జరిగిన ఈవెంట్ లో రిలీజ్ చేశారు. నాలుగేళ్ళుగా ఇలాంటి ప్రాజెక్ట్ కోసం ఎదురుచూస్తున్నానని అఖిల్ సార్థక్ అన్నాడు. యాభై ఎపిసోడ్స్ గా ఈ వెబ్ సీరిస్ రాబోతోందని, తెలుగులో ఇప్పటి వరకూ ఇలాంటిది రాలేదని నటి శుభశ్రీ చెప్పింది. తమిళంలో సక్సెస్ అయిన ప్రాజెక్ట్ ను తెలుగు ఆడియెన్స్ ముందుకు తీసుకొస్తున్నామని, పేషన్ అండ్ టాలెంట్ ఉన్న టీమ్ తో వర్క్ చేశామని ఆహా కంటెంట్ హెడ్ వాసు అన్నారు.