NBK112

NBK112: ఈసారి తమన్ కాదు… ఏకంగా బక్కోడే రంగంలోకి దిగాడు

NBK112: నందమూరి బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుండి సినిమాపైన అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తున్న ఇంకో వార్తతో అంచనాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఇదే నిజం అయితే బాలయ్య కెరీర్‌లో వన్ ఆఫ్ ది బెస్ట్ ఎలివేషన్స్ మ్యూజిక్ అవుతుంది.

రజినీకాంత్‌కి బక్కోడు.. బాలయ్యకి ఈ బండోడు అంటూ ఇంతకు ముందు థమన్ చేసిన కామెంట్స్ మనందరికీ తెలిసిందే. గత కొంత కాలంగా బాలకృష్ణ సినిమాలకి థమన్ మ్యూజిక్ అందిస్తూ వస్తున్నారు. అవి బాలయ్యకు బెస్ట్ ఎలివేషన్స్ ఇచ్చిన మ్యూజిక్ అని చెప్పొచ్చు. అలాగే కొరటాల శివ తన స్టార్టింగ్ సినిమాల నుండి దేవి శ్రీ ప్రసాద్‌ని తీసుకున్నారు, కానీ దేవర సినిమాకి మాత్రం అనిరుధ్‌ని తీసుకొని ఎక్స్‌పెరిమెంట్ చేశారు.

అది వర్కౌట్ అయింది అని చెప్పొచ్చు. సాంగ్స్‌తోనే దేవర సినిమాపైన క్రేజ్ పెరిగింది అని చెప్పడంలో తప్పు లేదు. మళ్ళీ ఆ మ్యాజిక్ ని రిపీట్ చేయాలనుకుంటున్నారు కొరటాల. ఈ కాంబినేషన్ సెట్ అయితే బాలకృష్ణ డైలాగ్స్‌కి ఎలాంటి మ్యూజిక్ కొడతారో చూడాలి. సాంగ్స్ ఇంకా ఎలివేషన్స్ గురించి చెప్పనక్కరలేదు.

సోషల్ మీడియాలో వినిపిస్తున్న ఇంకో వార్త ఏంటంటే.. ఈ సినిమాలో ఓ పవర్‌ఫుల్ సీఎం గా బాలకృష్ణ కనిపించనున్నట్టు తెలుస్తోంది. ఇంకా సినిమాలో ఎవరెవరు నటిస్తున్నారో తెలియకపోయినా మే 7 నుండి షెడ్యూల్ స్టార్ట్ చేయనున్నారు. సుధాకర్ చెరుకూరి (శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్) ఇంకా యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *