Operation Smile: ఉత్తరప్రదేశ్‌లో 49 ఏళ్ల క్రితం జాతరలో కనిపించకుండా పోయిన ఓ మహిళను అజంగఢ్ పోలీసులు తిరిగి కుటుంబ సభ్యులతో కలిపారు. యూపీలోని మొరాదాబాద్‌కు చెందిన బుల్మతి అనే బాలిక 8 ఏళ్ల వయసులో తన తల్లితో కలిసి జాతరకు వెళ్లి కనిపించకుండా పోయింది.
ఇప్పుడు 57 సంవత్సరాల వయస్సులో తన కుటుంబాన్ని చేరుకుంది. తన 8 ఏళ్ల వయసులో కుటుంబం నుంచి తప్పిపోయిన బుల్మతి అనే మహిళ చాలా కాలం పాటు తన కుటుంబాన్ని చూడటానికి అనేక ప్రయత్నాలు చేసింది. కానీ, ఫలితం లేకుండా పోయింది. ఈ విషయం తెలుసుకున్న రాంపూర్‌కు చెందిన పూజా రాణి అనే పాఠశాల ఉపాధ్యాయురాలు అజంగఢ్ పోలీస్ ఎస్పీ హేమ్‌రాజ్ మీనాకు సమాచారం అందించింది. బుల్మతికి ఫోన్ చేసి వివరాలు సేకరించారు. ఆ తర్వాత ‘ఆపరేషన్ స్మైల్’ పేరుతో ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేశారు. బుల్మతి ఇచ్చిన సమాచారం ఆధారంగా ప్రత్యేక బలగాలు మౌ జిల్లాలో అతని మామ రామ్ చందర్ ఇంటిని కనుగొన్నాయి.
ఇది కూడా చదవండి: Manmohan Singh: ఈరోజు ఉదయం 11:45 గంటలకు మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు
ఇలా జరిగింది..
Operation Smile: మొదట 1975లో బుల్మతీ అదృశ్యమైనట్లు పోలీసులు ధృవీకరించారు. తరువాత, వారు అజంగఢ్ జిల్లా పెట్పూర్ గ్రామంలో బుల్మతి సోదరుడు లాల్దార్‌ను కనుగొన్నారు. వారితో బుల్మతీ గుర్తింపును నిర్ధారించిన తర్వాత, వారు కుటుంబ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశం ఉద్వేగభరితంగా సాగింది.
ఆజంకార్ ఎస్పీ హేమ్‌రాజ్ మీనా మాట్లాడుతూ.. ఇప్పుడు, బుల్మతిగా గుర్తించబడిన మహిళ, ఆమె 8 ఏళ్ల బాలికగా ఉన్నప్పుడు మొరాదాబాద్‌లోని ఒక జాతర నుండి తప్పిపోయింది. ఆమెను ఓ వృద్ధుడు ఎత్తుకెళ్లి రాంపూర్‌లోని ఓ కుటుంబానికి విక్రయించాడని చెప్పారు. అక్కడ పెరిగిన ఆమె కొద్దిగా ఊహ వచ్చిన దగ్గర నుంచి తనవారిని కలవాలని ప్రయత్నాలు చేసింది. కానీ, ఎప్పుడూ కుదరలేదు. చివరకు రాంపూర్‌కు చెందిన పూజా రాణి ఇచ్చిన సమాచారంతో ఆపరేషన్ స్మైల్ పేరుతో బుల్మతి కుటుంబ సభ్యులను వెతికే పని చేపట్టారు. వారి కృషితో ఆమె తన సవంత కుటుంబాన్ని 57 సంవత్సరాల వయసులో కలుసుకోగలిగింది. దీంతో ఆమె, ఆమె కుటుంబం సంతోషంతో సంబరం చేసుకున్నారు. పోలీసులకు బుల్మతి, ఆమె కుటుంబ సభ్యులు తమ కృతఙ్ఞతలు చెప్పుకుంటున్నారు.