High Court: మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావుకి హైకోర్టు లో ఊరట లభించింది.మేడిగడ్డు బ్యారేజీ కుంగుబాటుపై భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు సస్పెండ్ చేసింది.జిల్లా కోర్ట్ ఇచ్చిన ఆదేశాలు సరిగాలేవు సరిగా లేవు అని న్యాయమూర్తి చెప్పారు. భూపాలపల్లి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రాజలింగమూర్తికి ఉన్నత న్యాయస్థానం నోటీసులు ఇచ్చింది.
భూపాలపల్లి కోర్టుకు విచారణ పరిధి లేదని కేసీఆర్, హరీష్ రావు తరపు న్యాయవాది హైకోర్టు తెలిపారు. ఈ మేరకు హైకోర్టు సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చింది అని తెలిపారు. ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత భూపాలపల్లి జిల్లా సెషన్స్ కోర్టు ఇచ్చిన ఆదేశాలను సస్పెండ్ చేసింది. తదుపరి విచారణ జనవరి 7కు వాయిదా వేసింది.