Allu Arjun: అల్లు అర్జున్ తన తరువాత సినిమాను త్రివిక్రమ్ తోనే చేయబోతున్నాడని వార్తలు గట్టిగా వస్తున్నాయి. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా సాగుతున్నాయట. తాజా సమాచారం ప్రకారం, త్రివిక్రమ్, అల్లు అర్జున్ కలిసి ఈ సినిమాకు సంబంధించి పూర్తి నెరేషన్ ఇచ్చారని కూడా తెలుస్తోంది.ఈ సినిమా ఒక మైథలాజికల్ పీరియడ్ డ్రామాగా రూపొందనుందని సమాచారం. ఇందులో బన్నీ కూడా కొత్తగా ఉంటుందట. హారికా హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై సూర్యదేవర రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇంతకు ముందు “జులాయి”, “సన్నాఫ్ సత్యమూర్తి”, “అల వైకుంఠపురములో” వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చిన బన్నీ-త్రివిక్రమ్ కాంబో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పరచింది. అందుకే ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులలో అంచనాలు ఓ రేంజిలో ఉన్నాయి.
