Sangareddy Crime: జహీరాబాద్ లో విషాదం చోటుచేసుకుంది. హాస్టల్లో ఉంటున్న బాలుడు అనుమానాస్పదంగా మృతిచెందడం తీవ్ర కలకలం రేపింది.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లోని సెవెంత్ డే ప్రైవేటు స్కూల్ లో సాత్విక్ అనే బాలుడు ఐదో తరగతి చదువుకుంటున్నాడు. అక్కడే హాస్టల్లో ఉంటూ చదువుకొనసాగిస్తున్నాడు. అయితే ఈరోజు ఉదయం సాత్విక్ మృతి చెందాడు. హాస్టల్ లో మంచం వద్ద కిందపడివున్న సాత్విక్ ను చూసిన మరికొందరు బాలురు వెంటనే యాజమాన్యానికి సమాచారం ఇచ్చినట్లు హాస్టల్ సిబ్బంది తెలిపారు. అయితే స్వాత్విక్ వెళ్లి చూడగా మృతి చెందాడని తెలిపారు.
Sangareddy Crime: దీంతో వెంటనే సాత్విక్ కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని తెలిపారు. సాత్విక్ హాస్టల్ లో మంచం పైనుంచి పడి మృతి చెందాడని స్కూల్ యాజమాన్యం చెబుతున్నారు. వెంటనే సాత్విక్ మృతదేహాన్ని జహీరాబాద్ ఏరియా ఆసుపత్రికి తరలించామని అన్నారు. అయితే సాత్విక్ తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకోగా జహీరాబాద్ లో సాత్విక్ మృతదేహం ఉందన్నారు..
దీంతో తల్లిదండ్రులు ఆసుపత్రికి చేరుకోగా సాత్విక్ మృతదేహాన్ని బోరున విలపించారు. సాత్విక్ కు తల, పెదవులు, కనుబొమ్మలపై గాయాలు ఉన్నాయని మండిపడ్డారు. హాస్టల్ లో మంచం పైనుంచి పడితే ఇలా గాయాలు ఎలా అవుతాయని ప్రశ్నించారు. తన బిడ్డను హాస్టల్లో కొట్టారని, దాని వల్లే సాత్విక్ చనిపోయాడని ఆరోపిపంచారు. విద్యార్థి మృతి పై తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ఆందోళనకు దిగారు. దీంతో జహీరాబాద్ ఆసుపత్రి వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
Sangareddy Crime: స్థానిక సమాచారంతో ఆసుపత్రి వద్దకు చేరుకున్న పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆందోళన విరమించాలని సాత్విక్ కుటుంబ సభ్యులను కోరారు. న్యాయం జరిగేంత వరకు సాత్విక్ మృతదేహాన్ని కదిలించే ప్రశక్తే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పై చదువులు చదువుకుని తల్లిదండ్రులకు తోడుగా ఉంటాడని అనుకుంటూ హాస్టల్ యాజమాన్యం సాత్విక్ ను పొట్టన పెట్టుకుందని కన్నీరుమున్నీరుగా విలపించారు.