Peddi

Peddi Release Date: మళ్లీ మారిన రిలీజ్ డేట్.. ఎప్పుడంటే..?

Peddi: ఇప్పటికే పలుమార్లు పోస్టుపోన్ అయిన ‘పెద్ది’ సినిమా నుండి అభిమానులకి ఓ శుభవార్త అందింది. పెద్ది సినిమా మళ్ళీ తన రిలీజ్ డేట్ ని మార్చనుంది. ఇందులో గుడ్ న్యూస్ ఏముందంటారా.. జూన్ 25న రిలీజ్ కానున్న ఈ సినిమా ఇప్పుడు జూన్ 4న రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. ఇదే జరిగితే సినిమా 21 రోజుల ముందే వచ్చేస్తుంది.

ఎప్పటిలాగా రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌ని సోషల్ మీడియాలో విడుదల చేయకుండా, పెద్ది మూవీ టీమ్ ఈరోజు 4 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి అక్కడే రిలీజ్ డేట్ ఇంకా సోషల్ మీడియాలో వస్తున్న రూమర్స్ పైన క్లారిటీ ఇవ్వనున్నారు.

అలాగే పెద్ది మూవీ టీమ్ సినిమా ప్రమోషన్స్ కోసం కొత్తగా ఆలోచిస్తూ సినిమాని జనాల్లోకి తీసుకెళ్తోంది. ఎప్పటినుండో వస్తున్న ఓ సంప్రదాయాన్ని మార్చనుంది. సినిమాకి ముందే సాంగ్స్‌ని రిలీజ్ చెయ్యడం అనేది ఎప్పటినుండో ఉన్న సంప్రదాయం. ఇలా చేయడం వల్ల సినిమాకి హైప్ రావడమే కాకుండా, సాంగ్స్‌ని థియేటర్‌లో చూడాలనుకునే వాళ్ళు కూడా సినిమాకి వస్తారు. కానీ సోషల్ మీడియాలో వినిపిస్తున్న దాని ప్రకారం, ‘పెద్ది’ నుండి ఇప్పటికే వచ్చిన రెండు సాంగ్స్‌తో పాటు ఇంకో సాంగ్.. శృతి హాసన్ చేసిన స్పెషల్ సాంగ్‌ని మాత్రమే రిలీజ్ చేసి మిగిలిన సాంగ్స్‌ని డైరెక్ట్ గా సినిమాలోనే చూపిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. వీటిలో ఎంతవరకు నిజం ఉందో తెలియాలంటే ఈరోజు సాయంత్రం వరకు ఆగాల్సిందే.

Image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *