Nara Bhuvaneshwari: నందమూరి తారక రామారావు ముని మనవడు ఎన్టీఆర్ త్వరలోనే హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతన్ని హీరోగా పరిచయం చేస్తూ స్వీయ దర్శకత్వంలో వైవియస్ చౌదరి ఓ సినిమాను నిర్మించబోతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ ను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిన్నానలు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తాజాగా నారా చంద్రబాబు నాయుడు భార్య భువనేశ్వరి సైతం తన ఆశీస్సులు అందించారు. భువనేశ్వరి అన్న హరికృష్ణ పెద్ద కుమారుడు జానకిరామ్ తనయుడే ఈ ఎన్టీఆర్. రామ్ సినీ రంగ ప్రవేశం పట్ల భువనేశ్వరి హర్షం వెలిబుచ్చారు. తమ కుటుంబ వారసత్వాన్ని రామ్ ముందుకు తీసుకెళతాడనే నమ్మకం ఉందని ఆమె అన్నారు. ఆమె ఆశీస్సులు ఖచ్చితంగా రామ్ కు గొప్ప వరం అనే అనుకోవాలి.