AP News: పండగ ప్రాణం తీసింది. హాయిగా అలా అలా …సముద్ర తీరంలో ..స్నానం చేద్దాం అనుకుంటే ..సముద్రుడు వారి అందరిని మింగేశాడు. పాపం ఎవరిది ? కాని కన్న వారికి కడుపుకోత అయితే మిగిలింది. సంక్రాతి సెలవులకని వెళ్లి ..అలానే తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు ఆ స్నేహితులు.
సంక్రాంతి సెలవుల్లో విహారయాత్రకు వచ్చిన స్నేహితులు మృత్యువాత పడ్డారు. ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలానికి చెందిన ఆరుగురు స్నేహితులు పాకల సముద్ర తీరానికి విహారయాత్రకు వచ్చారు. ముక్కనుము సందర్భంగా వీరంతా సముద్రంలో స్నానాలు చేస్తున్నారు. అలల తీవ్రతను అంచనా వేసుకోలేని వీళ్లలో ఐదుగురు కెరటాలకు కొట్టుకుపోయారు.
అక్కడే ఉన్న మిర్రర్ పోలీసులు అప్రమత్తమే వారిని కాపాడేందుకు ప్రయత్నించారు. ఇందులో ఒకరిని అతి కష్టం మీద ప్రాణాలతో రక్షించగలిగారు. ముగ్గురు సముద్రంలో మునిగి మృతి చెందారు. మరో వ్యక్తి గల్లంతయ్యారు. మృతులు పోన్నలూరు మండలం శివన్న పాలెంకు చెందిన మాధవ , జెస్సికా, యామినిలుగా గుర్తించారు. తన్నీర్ పవన్ అనే వ్యక్తి గల్లంతు అయ్యారు. అతని కోసం గాలిస్తున్నారు.నవ్య అనే మహిళను కాపాడారు. మృతదేహాలను నెల్లూరు జిల్లా కందుకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.