Traffic Rules: కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు కఠినతరంగా ఉన్నాయి. ఈ నూతన రహదారి భద్రతా నిబంధనలు దేశవ్యాప్తంగా ఒక్కో రాష్ట్రంలో అమలులోకి వస్తున్నాయి. ఈ చట్టాల ప్రకారం రోడ్డు ప్రమాదాలకు కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది. గతంలోనే మైనర్లు వాహనాలు నడిపి యాక్సిడెంట్లు చేస్తే పెద్ద వారికి శిక్షలు పడేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కొత్త చట్టాల ప్రకారం.. ఇప్పుడు మైనర్లు వాహనం నడుపుతూ పట్టుబడితే ఏకంగా రూ.25 వేల జరిమానా విధిస్తారు. దాంతోపాటు 25 ఏండ్ల వయసు వచ్చే వరకు వారి లైసెన్స్ పొందే అవకాశం లేకుండా చేస్తారు. అదే విధంగా గత జరిమానాలకు ఇప్పటి జరిమానాలకు భారీగా వ్యత్యాసం ఉన్నది.
కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన కొత్త ట్రాఫిక్ నిబంధనలు ఇవే..
రెడ్‌లైట్ ఉల్లంఘన
మునుపటి జరిమానా- రూ.100
ప్రస్తుత జరిమానా – రూ.500
అథారిటీ ఆదేశాలను ఉల్లంఘించడం
మునుపటి జరిమానా -500
ప్రస్తుత జరిమానా – 2,000
లైసెన్స్ లేకుండా డ్రైవింగ్
మునుపటి జరిమానా -500
ప్రస్తుత జరిమానా – రూ.5,000
అతివేగం
మునుపటి జరిమానా -400
ప్రస్తుత జరిమానా – రూ.1,000
ప్రమాదకరమైన డ్రైవింగ్
మునుపటి జరిమానా -1000
ప్రస్తుత జరిమానా – రూ.5,000
డ్రంకన్ డ్రైవ్
మునుపటి జరిమానా -2000
ప్రస్తుత జరిమానా – రూ.10,000
రేసింగ్ స్పీడింగ్
మునుపటి జరిమానా -500
ప్రస్తుత జరిమానా – రూ.5,000
హెల్మెంట్ ధరించకుంటే
మునుపటి జరిమానా -100
ప్రస్తుత జరిమానా – రూ.1,000+మూడు నెలలు లైసెన్స్ రద్దు
సీట్ బెల్ట్ ధరించకుంటే
మునుపటి జరిమానా -100
ప్రస్తుత జరిమానా – రూ.1,000
అత్యవసర వాహనాలను అడ్డుకుంటే
మునుపటి జరిమానా – ప్రస్తుతం నిర్దిష్ట జరిమానా లేదు
ప్రస్తుత జరిమానా – రూ.10,000
బైక్‌లపై ఓవర్‌లోడ్
మునుపటి జరిమానా -100
ప్రస్తుత జరిమానా – రూ.2,000+మూడు నెలల లైసెన్స్ రద్దు
ఇన్సూరెన్స్ లేకుండా డ్రైవింగ్
మునుపటి జరిమానా -1000
ప్రస్తుత జరిమానా – రూ.2,000