Abishan Jeevinth: టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటిన అభిషన్ జీవింత్ ఇప్పుడు హీరోగా మారుతున్నారు. ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించిన ఆయన, తాజాగా కరెక్టెడ్ మచ్చి అనే చిత్రంతో ప్రధాన హీరోగా అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా యువ నటి అనస్వర రాజన్ నటిస్తున్నారు. ఆమె సూపర్ శరణ్య, థగ్స్ వంటి సినిమాలతో తనదైన ముద్ర వేస్తున్నారు. కరెక్టెడ్ మచ్చి టైటిల్ శింబు నటించిన మన్మథన్ సినిమాలోని పాపులర్ డైలాగ్ నుంచి స్ఫూర్తి పొందినట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉంది. అభిషన్ దర్శకుడిగా సాధించిన విజయం తర్వాత, హీరోగా ఆయన ఎలాంటి ప్రభావం చూపిస్తారనే ఆసక్తి సినీ వర్గాల్లో నెలకొంది. ఈ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. తమిళ సినిమాల్లో దర్శకులు నటులుగా మారడం కొత్త కాదు, కానీ అభిషన్ ఈ కొత్త ప్రయాణంలో ఎలాంటి విజయం సాధిస్తారనేది చూడాలి.
