Tollywood: టాలీవుడ్‌లో విషాదం అలుముకున్నది. ప్రముఖ సినీ దర్శకుడైన ఏఎస్ రవికుమార్ గుండెపోటుతో కన్నుమూశారు. గతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్టు తెలుస్తున్నది. ఆయన మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన హఠాన్మరణంతో టాలీవుడ్‌లో విషాదఛాయలు అలుముకున్నాయి. పలువురు సిని ప్రముఖులు సంతాపం తెలుపుతున్నారు.
Tollywood: ఏఎస్ రవికుమార్ గోపిచంద్ హీరోగా నటించిన యజ్ఞం సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణతో యువ హీరోలు నితిన్, సాయిదుర్గా తేజ్, రాజ్ తరుణ్ వంటి యువ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించారు. కార్డియాక్ అరెస్టు కావడంతో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Tollywood: ఏఎస్ రవికుమార్‌కు ఇటీవల సక్సెస్‌లు లేకపోవడంతో ఆయన సినిమాలకు కొంతకాలంగా దూరంగా ఉంటున్నారు. దీంతోపాటు కుటుంబంలో గొడవలు ఉన్నట్టు తెలుస్తున్నది. దీంతో ఆయన తన కుటుంబానికి కూడా దూరంగా ఉంటున్నట్టు సమాచారం. ఈ ఒత్తిడిలో ఆయన మద్యానికి బానిస అయినట్టు వినికిడి.