Tollywood

Tollywood: వరుసగా గాయపడుతున్న టాలీవుడ్ స్టార్ హీరోలు..!

Tollywood: తెలుగు సినిమా ఇండస్ట్రీ లోని స్టార్ హీరోస్ అందరికి వరుసగా గాయాలబారిన పడుతుండటం సినీ వర్గాల్లో, అభిమానుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, బాలకృష్ణల తర్వాత ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రమాదానికి గురయ్యారు. ఒకే నెలలో నలుగురు స్టార్ హీరోలు ఆస్పత్రుల పాలవ్వడం గమనార్హం.

1. జూనియర్ ఎన్టీఆర్‌కు భుజం గాయం

మంగళవారం ఎన్టీఆర్ కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం షూటింగ్ సమయంలో ఆయన భుజానికి గాయమైంది.

ప్రముఖ వైద్యుల బృందం (డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ పూర్ణచంద్ర తేజస్వి) ఆయనకు చికిత్స అందించి, 8 వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.ఎన్టీఆర్ ఆరోగ్యంపై ఎలాంటి నిరాధారమైన వార్తలను నమ్మవద్దని, ఆయన క్షేమంగా ఉన్నారని కార్యాలయం ప్రకటించింది.

2. కాకినాడ షూటింగ్‌లో బాలకృష్ణకు గాయం

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వస్తున్న ‘NBK 111’ సినిమా షూటింగ్ సందర్భంగా కాకినాడ పోర్ట్‌లో నందమూరి బాలకృష్ణ మోకాలికి గాయమైంది.

మోకాలి లిగమెంట్ దెబ్బతినడంతో ఆయనను ఎయిర్ లిఫ్ట్ చేసి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.ప్రస్తుతం ఆయనకు ఒక మైనర్ సర్జరీ పూర్తికాగా, ఆరోగ్యం స్థిరంగా ఉందని వైద్యులు తెలిపారు. ఇటీవలే ఏపీ సీఎం చంద్రబాబు కూడా బాలయ్యను పరామర్శించారు.

3. కోయంబత్తూరులో రామ్ చరణ్ మణికట్టు ఆపరేషన్

‘పెద్ది’ సినిమా షూటింగ్‌లో రామ్ చరణ్ కుడిచేతి మణికట్టుకు తీవ్ర గాయమైంది. తమిళనాడులోని కోయంబత్తూర్ ‘గంగా’ ఆర్థోపెడిక్ ఆస్పత్రిలో డాక్టర్ ఎస్. రాజశేఖరన్, అమెరికా నిపుణుడు డాక్టర్ అలెజాండ్రో బాడియా నేతృత్వంలో ఆయనకు లాప్రోస్కోపిక్ సర్జరీ జరిగింది.ప్రస్తుతం ఆయన వద్ద చిరంజీవి, సురేఖ, ఉపాసన ఉన్నారు.

4. ముంబైలో పవన్ కళ్యాణ్‌కు భుజం సర్జరీ

ఏపీ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత కొంతకాలంగా భుజం నొప్పితో బాధపడుతున్నారు. భుజంలో కండరాలు చిట్లడంతో జులై 11న ముంబైలోని ‘కోకిలాబెన్’ ఆస్పత్రిలో ఆయన కుడి భుజానికి ఆపరేషన్ పూర్తయింది. మరో రెండు నెలల తర్వాత ఎడమ భుజానికి కూడా సర్జరీ చేయనున్నట్లు తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *