Gold rate: బంగారం ధరలు మళ్లీ తగ్గుముఖం పడుతున్నాయి. ఆ మధ్య ఆల్‌టైమ్ హై రికార్డులతో హోరెత్తించిన గోల్డ్ ట్రంప్ పుణ్యమా అని భారీగా తగ్గింది.. కానీ అది ఎక్కువ రోజులు నిలవకుండానే మళ్లీ పరుగులు పెట్టింది. కొద్దిరోజులకి 80 వేల మార్క్ ను తాకింది. ఇప్పుడు మళ్ళీ పతనం దిశగా బంగారం ధరలు సాగుతున్నాయి. ఈ క్రమంలోనే మంగళవారం హైదరాబాద్‌లో తులం 24 క్యారెట్ బంగారం ధర ఏకంగా రూ.1,310 పడిపోయింది. రూ.77,240 వద్ద స్థిరపడింది. సోమవారం కూడా రూ.1,090 కోల్పోయిన విషయం తెలిసిందే.
దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 73 వేల వద్ద ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 78వేల 180 వేల 500 పలుకుతోంది.
దేశ వాణిజ్య రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 72 వేల 250 ఉంది. అలాగే 24 క్యారెట్ల మేలిమి రూ. 78 వేల 255గా ఉంది.
చెన్నైలో 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేటు రూ. 78 వేల 180గా ఉంది.