Tirumala:తిరుపతి తొక్కిసలాట ఘటన భక్తజన కోటిని విషాదంలో ముంచింది. ఈ ఘటనలో గాయపడి క్షతగాత్రులైన ఎందరో భక్తులు తిరుపతిలోని దవాఖానల్లో చికిత్స పొందారు. ఇప్పటికే తేరుకున్న భక్తులకు టీటీడీ సదవకాశం కల్పించింది. ఏడుకొండల వాడి దర్శనం కోసం వందల, వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చిన ఆ భక్తులకు తొక్కిసలాట ఘటన తీరని వ్యధను మిగిల్చింది. మెరుగైన వైద్యంతో కోలుకున్న వారికి టీటీడీ ఉపశమనం కల్పించింది.
Tirumala:సీఎం చంద్రబాబు, టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆదేశాల మేరకు మొత్తం 52 మంది తొక్కిసలాట బాధితులకు తిరుమలలో శుక్రవారం ప్రత్యేక దర్శనం కల్పించారు. అధికారులు దగ్గర ఉండి వారిని ఆలయం లోపలి వరకూ తోడ్కోని వెళ్లి ఉత్తర ద్వారదర్శనం ద్వారా స్వామివారి దర్శనం కల్పించారు. దీంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం, టీటీడీకి వారు ధన్యవాదాలు తెలిపారు.