TikTok:జనవరి 19 నుంచి టిక్‌టాక్‌పై నిషేధం విధిస్తున్నట్టు అమెరికా దేశంలోని సుప్రీంకోర్టు సంచనల తీర్పు వెలువరించింది. అమెరికా దేశ జాతీయ భద్రతకు ఈ యాప్ ముప్పు కలిగిస్తుందన్న అనుమానంతో దేశంలో నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు కోర్టు స్పష్టం చేసింది. అంటే జనవరి 19 అంటే ఆదివారం నుంచి టిక్‌టాక్ సేవలు అమెరికాలో బంద్ కానున్నాయన్నమాట.
TikTok: ఇదిలా ఉండగా, ఏదైనా అమెరికా కంపెనీకి టిక్‌టాక్‌ను చైనా మాతృసంస్థ అమ్మితే ఈ నిషేధాన్ని రద్దు చేస్తామని అమెరికా సుప్రీంకోర్టు తేల్చి చెప్పింది. అమ్మకపోతే మాత్రం నిషేధం విధించాలన్న చట్టాన్ని సమర్థిస్తూ తీర్పునిచ్చింది. అయితే టిక్‌టాక్‌ను అమెరికా ప్రముఖుడైన ఎలాన్ మస్క్ కొనుగోలు చేయనున్నట్టు విశేష ప్రచారం జరిగింది. ఒకవేళ ఆయన గనుక కొనుగోలు చేస్తే యథావిధిగా టిక్‌టాక్ సేవలు కొనసాగే అవకాశం ఉన్నది. ఒక్కరోజే మిగిలి ఉండటంతో దీనిపై అంతటా ఉత్కంఠ నెలకొన్నది.