Emergency: కంగనా రనౌత్ నటించిన ‘ఎమర్జెన్సీ’ ఆడియన్స్ ముందుకు వచ్చింది. రాజకీయ ప్రాధాన్యం ఉన్న ఈ చిత్రం రిలీజ్ కు ముందు చాలా కష్టాలను ఎదుర్కొంది. సెన్సార్ కారణంగా పలు సార్లు వాయిదా పడిన ఈ సినిమా సిక్కు సంఘాలనుంచి వ్యతిరేకతను ఫేస్ చేసింది. ఎట్టకేలకు సెన్సార్ ముగించుకుని 17న విడుదలైంది. మిక్స్ డ్ రివ్యూస్ ను సంపాదించిన ఈ సినిమాను పంజాబ్ లో నిషేదించాలని శిరోమణి గురుద్వార్ ప్రబంధక్ కమిటీ పిలుపును ఇచ్చింది. ఇది సిక్కు వ్యతిరేక చిత్రమని ఎస్ జి పిసి అధ్యక్షుడు హర్జిందర్ సింగ్ ధామి పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ కు లేఖ రాసి రాష్ట్రంలో సినిమాను రిలీజ్ చేయరాదని వాదించారు. దాంతో పంజాబ్ లో చాలా థియేటర్లలో ‘ఎమర్జెన్సీ’ సినిమా ఫస్ట్ వేయకుండా కాన్సిల్ చేశారు. దీనిపై కంగన్ స్పందిస్తూ ఇది ఆర్ట్ పైన, ఆర్టిస్ట్ పైనా వేధింపులేననింది. అయితే ఈ ఆందోళనల మధ్య పంజాబ్ లోని అమృత్ సర్, బర్నాలా, మాన్ సా, మోగా, పాటియాలాలో సినిమాను ప్రదర్శించకుండా ఆపివేశారు. మరి ఆ జిల్లాలలో ‘ఎమర్జెన్సీ’ ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.