The Raja Saab: ఇవాళ పాన్ ఇండియా కల్చర్ పెరిగిన తర్వాత మన మేకర్స్ పరభాషా సినీ అభిమానులను దృష్టిలో పెట్టుకుని సినిమాలను రూపొందిస్తున్నారు. ఆ మధ్య `పుష్ప-2`లో ఓ పాటకు మలయాళ సాకీని పెట్టారు. అది మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంది. తాజాగా `రాజా సాబ్`కు సంబంధించిన సాంగ్స్ అప్ డేట్ ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చారు. ఇందులో ఆరు పాటలు ఉంటాయని, అందులో హీరో ఇంట్రడక్షన్ సాంగ్ తో పాటు ఓ డ్యుయేట్, ఐటమ్ సాంగ్, రీమిక్స్ సాంగ్, ముగ్గురు హీరోయిన్లతో ప్రీ క్లయిమాక్స్ సాంగ్, `రాజా సాబ్ వరల్డ్`కు థీమ్ సాంగ్ ఉండబోతున్నాయని తెలిపారు.
ఇది కూడా చదవండి: Kushboo: విశాల్ అనారోగ్యంపై ఖుష్బూ వివరణ!
The Raja Saab: నేషనల్ వైడ్ మ్యూజిక్ లవర్స్ ను దృష్టిలో పెట్టుకుని రీ-మిక్స్ సాంగ్ చేయబోతున్నామని, మొత్తంగా మూవీ… ఓ ఫెయిరీ టేల్ ను తలపిస్తుందని అన్నారు. అలానే జపాన్ లోనూ ఆడియో ఫంక్షన్ ను జరుపుబోతున్నారని, అందుకోసం జపనీస్ వర్షన్ లో పాటను చేయబోతున్నానని తమన్ తెలిపారు. ఇదిలా ఉంటే… ముందు ప్రకటించినట్టుగా ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల అవుతుందా లేదా అనే సందేహం వస్తోంది. ఎందుకంటే అదే రోజున అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ని రిలీజ్ చేయబోతున్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించారు.ప్రభాస్ అభిమానులు ఏప్రిల్ 10 కోసం ఇప్పటికే కౌంట్డౌన్ మొదలుపెట్టేసారు.