Thandel: యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తున్న చిత్రం తండేల్. టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ చిత్రంపై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇది చైతు కెరీర్లోనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని అక్కినేని ఫ్యాన్స్ తో పాటు మేకర్స్ కూడా సూపర్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ సినిమా బుకింగ్స్ కోసం పాన్ ఇండియా ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఇపుడు బుక్ మై షోలో బుకింగ్స్ ఓపెన్ చేసేసారు.ఆల్రెడీ నైజాంలో బుకింగ్స్ ఓపెన్ చేయగా వీటికి సాలిడ్ రెస్పాన్స్ వస్తుంది. ఇప్పటి వరకు బుక్ మై షోలో 20 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోగా లక్ష 50 వేలకి పైగా ఇంట్రెస్ట్స్ తో ట్రెండింగ్ లో కూడా కొనసాగుతుంది. దీంతో తండేల్ సినిమాకి మంచి ఓపెనింగ్స్ రావడం ఖాయమని తెలుస్తుంది. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఫిబ్రవరి 7న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. మరి ఈ సినిమాతో చైతు పాన్ ఇండియా హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.
