Thaman-Chiranjeevi: గేమ్ ఛేంజర్ సినిమా విడుదల అయిన దగ్గర నుంచీ సోషల్ మీడియాలో విపరీతంగా నెగెటివ్ ట్రోల్స్ కు గురయింది. సినిమా ఎలా ఉంది అనేది సాధారణ ప్రేక్షకులకు చేరుకునే లోపులోనే సినిమాపై దారుణంగా నెగిటివిటీ ప్రచారం జరిగిపోయింది. గేమ్ ఛేంజర్ బావుందా? లేదా? హిట్టా? ఫట్టా అనేది తేల్చాల్సిన సామాన్య ప్రేక్షకులను థియేటర్ల దగ్గరకు రానీయని విధంగా నెగెటివ్ ప్రచారం జరిగింది. దీంతో సినిమాకు భారీ డేమేజ్ అయిందన్న విషయం సినీ వర్గాలే ఒప్పుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్కొక్కరుగా గేమ్ ఛేంజర్ విషయంలో జరిగిన నెగెటివ్ ట్రోలింగ్ పై పెదవి విప్పుతున్నారు.
సినీ సంగీత దర్శకుడు తమన్ డాకూ మహారాజ్ మూవీ సక్సెస్ మీట్ లో మాట్లాడుతూ సినిమాని చంపేయకండి అని వ్యాఖ్యానించారు. గేమ్ ఛేంజర్ పై జరుగుతున్న నెగేటివ్ ట్రోలింగ్ పై తమన్ ఈవిధంగా స్పందించారు. నిర్మాతల పరిస్థితి గందరగోళంగా అవుతోంది. ఒక సక్సెస్ గురించి చెప్పాలంటే కూడా వారికి చెప్పుకునే అవకాశం లేకుండా ఉంటోంది. తమ సినిమా సక్సెస్ అయింది అని చెబితే వెంటనే నెగెటివ్ ట్రోలింగ్ తో భయపెడుతున్నారు. నెగెటివిటీ స్ప్రెడ్ చేసేవారు ఒక విషయం తెలుసుకోవాలి. మీరు చేసే ఈ పని నిర్మాతల జీవితాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. మన సినిమాని మనమే చంపేసుకుంటే ఎలా? ఇదేమి జీవితం? పర్సనల్ గా కొట్టండి కానీ సినిమాని మాత్రం చంపేయకండి అంతో ఆవేదనతో మాట్లాడారు.
ఇది కూడా చదవండి: Madhavi Latha: జేసీ ప్రభాకర్‌రెడ్డిపై నటి మాధవీలత ఫిర్యాదు
తమన్ ఆవేదనపై మెగాస్టార్ చిరంజీవి X వేదికగా స్పందించారు. తమన్ నీ బాధ అర్ధం అవుతోంది. ఎంత మనసులో నువ్వు బాధపడకపోతే అలా మాట్లాడతావు అంటూ చిరంజీవి తన ట్వీట్ లో పేర్కొన్నారు. తమన్ ఎప్పుడు సరదాగా ఉండే నువ్వు మాట్లాడిన మాటలు మనసును తాకేలా ఉన్నాయి. నీ మనసు ఎంత కలత చెందితే, నువ్వు ఇలా మాట్లాడి ఉంటావో అర్ధం అవుతోంది అంటూ చిరంజీవి తన ట్వీట్ లో రాసుకొచ్చారు. చిరంజీవి ట్వీట్ ఇక్కడ మీరూ చూడొచ్చు.