Telidu Gurthuledu Marchipoya: ఈ మధ్య కాలంలో బాగా పాపులర్ అయిన పదాలు ఇవి. క్రిమినల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పొలిటీషియన్లను అధికారులు ప్రశ్నించినప్పడు వారు చెబుతున్న మాట ఇదే! ‘తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా’!! ఇప్పుడో సినిమాకు అదే పేరుగా పెట్టేశారు. నివాస్, అమితశ్రీ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో ఇయర్స్ పృథ్వీ, వినోద్ కుమార్, రఘుబాబు, భరద్వాజ్, ఖయ్యూం కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ ను వెంకటేశ్ వీరవరపు దర్శకత్వంలో శరత్ చెన్నా నిర్మిస్తున్నారు. గురువారం రామానాయుడు స్టూడియోస్ లో ఈ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నటుడు రఘుబాబు క్లాప్ నివ్వగా, సంగీత దర్శకులు ఆర్ పి పట్నాయక్ కెమెరా స్విచ్ఛాన్ చేశారు. ఈ నెల 18 నుండి మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు కానుంది.