Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకున్నది. ఓ దళితురాలికి ఘోర అవమానం జరిగింది. రోజురోజుకు కుల, మత వైషమ్యాలు తగ్గాల్సింది పోయి పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. ప్రభుత్వ ఆస్రత్రుల్లో ఈ ఘటన సిబ్బంది నిర్లక్ష్యానికి, వివక్షకు నిలువుటద్దంగా నిలుస్తున్నది. గర్భిణి అని కూడా చూడకుండా కాఠిన్యం ప్రదర్శించడంపై ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని దిండోరి నగరంలోని ప్రభుత్వాస్పత్రిలో అనారోగ్యంతో ఉన్న ఓ దళితుడు చికిత్స కోసం చేరాడు. అక్కడే చికిత్స పొందుతూ ఆ దళితుడు చనిపోయాడు. దళితుడని ఆస్పత్రి సిబ్బందికి తెలిసింది. అతను చనిపోయిన బెడ్‌ను అతని భార్యతోనే శుభ్రం చేయించారు. గర్భిణి అయినా కూడా పరిపరి విధాలుగా అక్కడ, ఇక్కడ అంటూ ఆ గర్భిణి మహిళతో ఆ బెడ్‌ను శుభ్రం చేయించారు.
Madhya Pradesh: ఒకవైపు భర్త చనిపోయాడన్న పుట్టెడు శోకంలో ఉన్న ఆ మహిళ.. అక్కడి సిబ్బంది హుకుంతో పంటిబిగువున దుఃఖాన్ని దిగమింగుకుంటూ ఆ బెడ్‌ను శుభ్రం చేసింది. చెప్పింది కూడా మహిళలై ఉండి కూడా గర్భిణిపై కనీసం కనికరం చూపకపోగా, చాలా సేపటి దాకా ఆమెతో ఆ బెడ్‌ను శుభ్రం చేయించారు. ఈ విషయాన్ని అక్కడి ఒకరు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయింది. దీనిపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ये महिला सरकारी अस्पताल के जिस बिस्तर को साफ कर रही है उस पर थोड़ी देर पहले इनका पति लेटा था 5 महीने की गर्भवती है अस्पताल ने कथित तौर पर मौत के बाद बिस्तर इनसे साफ करवाया डिंडोरी में तिहरे हत्याकांड का मामला है इसके आगे मानवता और शब्द मर जाते हैं
श्रद्धांजलि… pic.twitter.com/IuDzX3kYM8— Anurag Dwary (@Anurag_Dwary) November 1, 2024