Telangana: కలెక్టర్, ఇతర అధికారులపై దాడి జరిగిన లగచర్ల కేసులో ప్రధాన నిందితుడు బోగమోని సురేశ్‌కు కోర్టు రెండు రోజుల పోలీస్ కస్టడీ విధించింది. పోలీసులు వారం రోజుల కస్టడీ కోరినప్పటికీ కోర్టు పరిగణన లోకి తీసుకోలేదు. కేవలం రెండు రోజులు మాత్రమే అనుమతించింది. ఈ మేరకు పోలీసులు మంగళ, బుధవారాల్లో ఘటనపై పలు అంశాలపై ప్రశ్నించనున్నారు.
Telangana: లగచర్ల దాడి ఘటనలో కీలక నిందితుడిగా పోలీసులు భావిస్తున్న బోగమోని సురేశ్‌ను తొలుత పోలీసులు అరెస్టు చేయలేకపోయారు. ఆయన అందుబాటులో లేకపోవడంతో ఇతర నిందితులను అరెస్టు చేసి రిమాండ్ చేశారు. అయితే వారం రోజులకు పైగా సురేశ్ అజ్ఞాతంలోకి వెళ్లాడు. ఆ తర్వాత కోర్టులో లొంగిపోవడంతో సరాసరి జైలుకు తరలించారు.
Telangana: ఆ తర్వాత కీలక నిందితుడైన బోగమోని సురేశ్‌ను విచారించేందుకు వారం రోజులపాటు పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు కోర్టును అభ్యర్థించారు. ఈ మేరకు విచారించిన కోర్టు కేవలం రెండు రోజులపాటు పోలీస్ కస్టడీకి ఇస్తూ ఆదేశాలు ఇచ్చింది. ఈ మేరకు నిందితుడు బోగమోని సురేశ్‌ను పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. లగచర్ల ఘటనకు ముందే ప్లాన్ చేశారని, ఆ ప్లాన్ ప్రకారమే అధికారులపై దాడి జరిగిందనేది పోలీసుల వాదన.
