Hyderabad: తెలంగాణ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సుజయ్ పాల్ నియమితులయ్యారు. రాష్ట్రపతి ఆమోదంతో6 ఆయన్ని ఈ పదవికి నియమిస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే బాంబే హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా బదిలీ అయ్యారు.
జస్టిస్ సుజయ్ పాల్ 1964 జూన్ 21న జన్మించారు. ఆయన బీకాం, ఎంఏ, ఎల్ఎల్‌బీ చదువులు పూర్తిచేశారు. 1990లో మధ్యప్రదేశ్ బార్ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకుని న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. ఆయన పలు బ్యాంకులు, మానవ హక్కుల కమిషన్, ఇతర బోర్డులకు న్యాయసేవలు అందించారు.
2011 మే 27న మధ్యప్రదేశ్ హైకోర్టులో అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ సుజయ్ పాల్, 2014 ఏప్రిల్ 14న శాశ్వత న్యాయమూర్తిగా నియమితులయ్యారు. సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసుతో 2024 మార్చి 21న తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తాజాగా, ఆయన హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు.