Telangana Cabinet: తెలంగాణ రాష్ట్ర మంత్రి మండలి విస్తరణల ఎట్టకేలకు ముహూర్తం ఖరారైంది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ వచ్చిన రాజకీయ వర్గాలకు ఫుల్‌స్టాప్ పడనున్నది. అయితే ఉన్న నాలుగు ఖాళీలను భర్తీ చేస్తారా? నాలుగింటినే ఎంపిక చేస్తారా? ఉన్న పదవుల్లో కోత పెట్టి మరీ కొత్త పదవులు నింపుతారా? అన్న విషయాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. మొత్తంగా మంత్రివర్గ విస్తరణపై మాత్రం ఓ నిర్ణయానికి వచ్చేసినట్టు విశ్వసనీయ సమాచారం. అయితే ఇంకా ఫైనల్ నిర్ణయాల కోసం ఇంకా ఢిల్లీలోనే రాష్ట్ర ముఖ్య నేతలు వేచి ఉండటం గమనార్హం.
Telangana Cabinet: కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పిలుపు మేరకు నిన్న (మార్చి 24న) ఢిల్లీ హుటాహుటిన సీఎం సహా రాష్ట్ర ముఖ్య నేతలు బయలుదేరి వెళ్లారు. వారిలో సీఎం రేవంత్‌రెడ్డితోపాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెళ్లారు. అదే రోజు వారు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నేత రాహుల్ గాంధీ, కీలక నేత కేసీ వేణుగోపాల్‌తో జరిగిన కీలక భేటీలో పాల్గొన్నారు.
Telangana Cabinet: ఈ భేటీలోనే మంత్రివర్గ విస్తరణపై విస్తృత స్థాయి చర్చ జరిగినట్టు సమాచారం. ఇదే సమయంలో పాలనా అంశాలనూ ఏఐసీసీ పెద్దలు రాబట్టినట్టు తెలిసింది. పథకాల అమలు గురించి కూడా వాకబు చేశారని వినికిడి. ఈ సమయంలోనే నాలుగు మంత్రి పదవులకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతున్నది. మరో రెండు బెర్త్‌లను ఖాళీగా ఉంచాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఇదే విస్తరణ సమయంలో డిప్యూటీ స్పీకర్, చీఫ్ విప్ పదవులనూ భర్తీకి నిర్ణయించారని సమాచారం.
Telangana Cabinet: నాలుగు మంత్రి పదవుల కోసం సుమారు 25 మంది ఎమ్మెల్యేలు ఎదురు చూస్తున్నట్టు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. అయినా నలుగురి పేర్లను అధిష్టానం పరిశీలనలో చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ సమాచారం. ప్రధానంగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, సుదర్శన్‌రెడ్డి పేర్లు దాదాపు ఖరారు అయినట్టు విశ్వసనీయంగా తెలుస్తున్నది. అదే విధంగా కార్పొరేషన్ పదవుల అంశంపైనా చర్చ జరిగిందని సమాచారం. వాటి జాబితాపై మరోసారి చర్చిద్దామని చెప్పారని వినికిడి.
Telangana Cabinet: ఇదే దశలో మరో ఆసక్తికర అంశం బయటకు వచ్చింది. అదేమిటంటే మంత్రులు కొండా సురేఖ, జూపల్లి కృష్ణారావులను మంత్రివర్గం నుంచి తప్పించి విజయశాంతికి, ప్రేమ్‌సాగర్‌రావులను మంత్రి వర్గంలోకి తీసుకుంటారనే టాక్ వినిపిస్తున్నది. దీంతో నలుగురు కాదు.. ఆరుగురిని మంత్రులుగా తీసుకుంటారనే ప్రచారం జరుగుతుంది. మిగిలిన మరో రెండు పదవులను హైదరాబాద్, రంగారెడ్డి కోటా కింద ఒకరికి, మైనార్టీ లేదా ఎస్టీ కోటా కింద ఇచ్చేందుకు పెండింగ్‌లో పెడుతున్నట్టు సమాచారం.
Telangana Cabinet: సీనియర్ మంత్రుల శాఖల్లోమార్పులు చేర్పులు ఉండొచ్చనే సమాచారం. దానిపైనా చర్చలు జరిగినట్టు తెలిసింది. అయితే ఇప్పటికీ రేవంత్‌రెడ్డి, ఇతర ముఖ్య నేతలు ఢిల్లీలోనే మకాం వేసి ఉన్నారు. ఏవైనా అధిష్టానం నుంచి మార్పులు చేర్పులకు అవకాశం ఉండి ఉండొచ్చని తెలిసింది. ఆఖరు దశలో ఎలాంటి మార్పులు లేకుంటే అనుకున్నట్టే జరుగుతుందని భావిస్తున్నారు.