Telangana: సిద్దిపేట నియోజకవర్గం పరిధిలోని రంగనాయక సాగర్ ప్రాజెక్టుపై మంగళవారం (సెప్టెంబర్ 2) బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో వినూత్న ప్రదర్శన నిర్వహించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చర్చకు అనుమతించింది. ఇప్పటికే అసెంబ్లీలో చర్చ జరుగుతున్నది. ఈ దశలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రంగనాయకసాగర్ ఆనకట్టపై నిలబడి వినూత్న తరహాలో ప్రదర్శన నిర్వహించి, కాళేశ్వరం గొప్పతనం ఇది అని శ్రేణులు నినాదాలు చేస్తూ సందడి చేశారు.
Telangana: ఇది కదా కాళేశ్వరం.. ఇదే కదా కాళేశ్వరం.. అని ముద్రించిన 100 మీటర్ల భారీ బ్యానర్‌ను ప్రదర్శిస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ప్రదర్శన నిర్వహించారు. అటు చూడు కాళేశ్వరం నీళ్లు.. ఇటు చూడు కాళేశ్వరం నీళ్లు రేవంత్‌రెడ్డీ.. అంటూ వారంతా నినాదాలు చేశారు. కాళేశ్వరం కట్టినందుకా? రైతులకు నీళ్లిచ్చినందుకా? సీబీఐ విచారణ అంటూ నినాదాలతో హోరెత్తించారు. దీనిపై వీడియోలు తీసి సోషల్ మీడియలో పోస్టులు పెట్టి వైరల్ చేశారు.
