IPL 2025: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టుకు విరాట్ కోహ్లీ మరోసారి కెప్టెన్సీ చేపట్టనున్నాడా? ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2025) సీజన్‌లో ఆర్‌సిబికి కొత్త నాయకుడు ఎవరు అనే అంశంపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా తాజా వ్యాఖ్యలతో ఈ ఊహాగానాలు మరింత బలపడ్డాయి.
ఒకప్పుడు విజయవంతమైన కెప్టెన్
విరాట్ కోహ్లీ 2011 నుంచి 2021 వరకు RCB కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ 10 ఏళ్ల ప్రయాణంలో అతను 143 మ్యాచ్‌లకు నాయకత్వం వహించి 66 గెలుపులు సాధించాడు. ముఖ్యంగా 2016లో కోహ్లీ కెప్టెన్సీలో RCB ఫైనల్‌కు చేరుకుంది. కానీ, టైటిల్ గెలుచుకోవడంలో విఫలమైంది.
సురేష్ రైనా ఆసక్తికర వ్యాఖ్యలు
ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో వన్డే మ్యాచ్ సందర్భంగా సురేష్ రైనా కామెంటరీ బాక్స్‌లో కోహ్లీ భవిష్యత్తుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఫిల్ సాల్ట్ అనే ఇంగ్లాండ్ ఆటగాడు విరాట్ కోహ్లీతో మైదానంలో సంభాషిస్తున్న సందర్భాన్ని పేర్కొంటూ, అతను RCB కెప్టెన్సీకి దారితీసే చర్చ చేస్తూ ఉండవచ్చు అని రైనా వ్యాఖ్యానించాడు.
RCB మళ్లీ కోహ్లీని కెప్టెన్‌గా నియమించనున్నదా?
సురేష్ రైనా వ్యాఖ్యలతో అభిమానుల్లో కోహ్లీ మళ్లీ RCB కెప్టెన్‌గా వస్తాడనే ఊహాగానాలు ఊపందుకున్నాయి. 2021లో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న కోహ్లీ, ఇప్పుడు మరోసారి జట్టుకు నాయకత్వం వహించే అవకాశం ఉందని చాలా మంది విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: KL Rahul: పాపం ఎప్పుడూ కె ఎల్ రాహుల్ కే అన్యాయం జరుగుతుందా?? గంభీర్ పై మండిపడ్డ సీనియర్ క్రికెటర్
RCB మేనేజ్‌మెంట్ అధికారికంగా ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. కానీ, కోహ్లీ తన కెప్టెన్సీ కాలంలో ఆర్‌సిబిని 3 సార్లు ప్లేఆఫ్స్‌కు తీసుకెళ్లిన రికార్డు ఉంది. దీంతో, అతను మళ్లీ జట్టును నడిపిస్తే విజయావకాశాలు మెరుగవుతాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఫ్యాన్స్ ఎగ్జైట్‌మెంట్ పీక్
విరాట్ కోహ్లీ మళ్లీ RCB కెప్టెన్‌గా వస్తే, ఫ్యాన్స్ ఖచ్చితంగా ఆనందం వ్యక్తం చేస్తారు. IPL 2025లో RCB కొత్త జట్టు కూర్పుతో బరిలో దిగనుండగా, కోహ్లీ నాయకత్వం మరింత ఉత్సాహాన్నిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇంకా అధికారిక ప్రకటన రాలేదు, కానీ RCB అభిమానులు కింగ్ కోహ్లీ రీఎంట్రీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు!
