Crime News: తమిళనాడులోని చెక్కనూరురాణి (Chekkannurani) పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఒక లారీ డ్రైవర్ అనుమానాస్పద మృతి కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపుతోంది! విచారణకు భయపడి అతడు పోలీస్ స్టేషన్ రెస్ట్ రూమ్‌లో ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు చెప్పిన కట్టుకథను పోస్టుమార్టం నివేదిక (Postmortem Report) పూర్తిగా తలకిందులు చేసింది! మృతుడి శరీరంపై ఉన్న తీవ్రమైన గాయాలు, అంతర్గత అవయవాలకు జరిగిన నష్టం వెలుగులోకి రావడంతో.. ఇది ముమ్మాటికీ లాకప్ డెత్ (Lockup Death) అని, పోలీసులు చిత్రహింసలకు గురిచేసి చంపేశారని మృతుడి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారం తీవ్రరూపం దాల్చడంతో ఉన్నతాధికారులు పోలీసు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు వేసి, కేసును సీబీ-సీఐడీకి (CB-CID) బదిలీ చేశారు.
అసలేం జరిగింది? – నవంబర్ 13 రాత్రి స్టేషన్‌కు తీసుకెళ్లిన పోలీసులు..
పోస్టుమార్టం రిపోర్టులో దిగ్భ్రాంతికర నిజాలు.
-
మెడపై 27 సెం.మీ. పొడవైన గుర్తులు: బాలకృష్ణన్ మెడ భాగంలో దాదాపు 27 సెంటీమీటర్ల పొడవున బలమైన గుర్తులు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు.
-
వీపుపై 5 చోట్ల రక్తస్రావం: అతని వీపుపై ఐదు చోట్ల తీవ్రంగా కొట్టడం వల్ల ఏర్పడిన రక్తస్రావంతో కూడిన గాయాలు (Contusions/Lacerations) ఉన్నట్లు రిపోర్టులో స్పష్టమైంది.
-
అంతర్గత అవయవాలకు తీవ్ర నష్టం: అంతేకాకుండా, లోపలి అవయవాలైన మెదడు, ఊపిరితిత్తులు వాపునకు (Edema/Swelling) గురైనట్లు పోస్టుమార్టం నివేదిక వెల్లడించింది.
ఇన్‌స్పెక్టర్ సహా సిబ్బంది సస్పెండ్ – సీబీ-సీఐడీ విచారణకు ఆదేశం!
