Bomb Blast: దేశ రాజధానిలో మరోసారి పేలుడు కలకలం సృష్టించింది.ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. పేలుడు శబ్దం విన్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక దళం, పోలీసు బృందం సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఇంకా సమాచారం లేదు. అంతకుముందు అక్టోబర్ 20న కూడా ప్రశాంత్ విహార్ ప్రాంతంలో పేలుడు సంభవించింది. గురువారం ఉదయం 11:58 గంటలకు పేలుడు గురించి తమకు సమాచారం అందింది అని ఢిల్లీ ఫైర్ సర్వీస్ అధికారులు చెప్పారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు పంపించాం అని తెలిపారు. ఢిల్లీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ప్రశాంత్ విహార్ ప్రాంతంలోని పీవీఆర్ సమీపంలో పేలుడు సంభవించింది. ఘటనా స్థలంలో పోలీసు బృందం చేరుకొని పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.