Karuppu: కోలీవుడ్ స్టార్ హీరో సూర్య (Suriya), టాలెంటెడ్ డైరెక్టర్ కమ్ యాక్టర్ ఆర్‌జే బాలాజీ (RJ Balaji) కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మక చిత్రం ‘కరుప్పు’ (Karuppu). ఈ సినిమా తెలుగులో ‘వీరభద్రుడు’ (Veerabhadrudu) పేరుతో థియేటర్లలో విడుదలైంది. థియేట్రికల్ రన్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టడమే కాకుండా, సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలలో ఒకటిగా నిలిచి ఘనవిజయాన్ని అందుకుంది.
అయితే, వెండితెరపై రికార్డులు సృష్టించిన ఈ సినిమా తాజాగా ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ (Amazon Prime Video) లో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో విడుదలైన సమయంలో ప్రేక్షకులు పెద్దగా పట్టించుకోని కొన్ని సాంకేతిక లోపాలను(టెక్నికల్ మిస్టేక్స్ ),ఈ ఇప్పుడు ఓటీటీలో లోకి వచ్చిన తర్వాత చూస్తున్న డిజిటల్ ఆడియన్స్ సినిమాలో ని తప్పులను ఇంకా గ్రాఫిక్స్ మిస్టేక్స్ ని సోషల్ మీడియాలో పెడుతూ వైరల్ చేస్తున్నారు.
ఫ్యాన్స్‌ను నిరాశపరుస్తున్న ‘ఫేస్-స్వాపింగ్’ (Face-Swapping) సాంకేతికత:
ఓటీటీ ప్రేక్షకులను, ముఖ్యంగా సూర్య అభిమానులను బాగా నిరాశపరుస్తున్న అతిపెద్ద లోపం ఏమిటంటే.. సినిమాలో వాడిన వీఎఫ్ఎక్స్ (VFX) ఫేస్-స్వాపింగ్ టెక్నిక్.
సాధారణంగా డూప్‌లను ఉపయోగించి చేసే ఫైట్ సీక్వెన్స్‌లలో హీరో ముఖాన్ని డిజిటల్‌గా మార్చడానికి (ఫేస్-స్వాపింగ్) ఈ టెక్నాలజీని వాడుతుంటారు. అయితే, ఈ సినిమాలో చాలా సాధారణ యాక్షన్ సీన్లలో కూడా ఈ విధానాన్ని నాసిరకంగా వాడటంతో.. సూర్య ఫేస్ చాలా చోట్ల ఆర్టిఫిషియల్‌గా కనిపిస్తోందని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
ఈ యాక్షన్ సీన్లలో వాడిన లోపభూయిష్టమైన టెక్నిక్ వల్ల సినిమా చూస్తున్నప్పుడు కలిగే కనెక్టివిటీ ఇంకా చూస్తునపు వచ్చే అనుభూతి (Viewing Experience) పూర్తిగా దెబ్బతిన్నట్లు ఆడియన్స్ అభిప్రాయపడుతున్నారు.
థియేటర్లలో తప్పిన నెగెటివ్ ఇంపాక్ట్:
ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. సినిమా థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్న సమయంలో ఈ వీఎఫ్ఎక్స్ లోపాలపై ఎవరూ పెద్దగా నోరు మెదపలేదు. ఇది నిజంగా ఆ సమయంలో సినిమాకు దక్కిన పెద్ద అదృష్టంగానే భావించాలి.
ఒకవేళ ఈ తరహా కంప్లైంట్స్ ఇంకా నెగెటివిటీ థియేట్రికల్ రన్ సమయంలోనే బయటకు వచ్చి ఉంటే.. కచ్చితంగా సినిమా కలెక్షన్లపై ఇంకా బాక్సాఫీస్ రెవెన్యూపై తీవ్రమైన ప్రభావం పడి ఉండేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
