Super Star Krishna: సూపర్ స్టార్ కృష్ణ నటించిన చివరి చిత్రం ‘ప్రేమ చరిత్ర – కృష్ణ విజయం’. యశ్వంత్, సుహాసిని జంటగా నటించిన ఈ చిత్రంలో నాగబాబు, అలీ కీలక పాత్రలు పోషించారు. హెచ్. మధుసూదన్ స్వీయ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని నిర్మించారు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ ప్రకటించారు. కృష్ణ నటించిన ఎన్నో చిత్రాలు సంక్రాంతి సీజన్ లో విడుదలై ఘన విజయం సాధించాయని, అదే నమ్మకంతో ఈ చిత్రాన్ని కూడా జనవరి 3న విడుదల చేయబోతున్నామని మధుసూదన్ అన్నారు.
ఇది కూడా చదవండి: Hitler: జనవరి 1న ‘హిట్లర్’ రీ-రిలీజ్
Super Star Krishna: కృష్ణ నటించిన ఈ ఆఖరి చిత్రం… విడుదల కాని సినిమాల జాబితాలో ఉండకూదనే పట్టుదలతో ఎన్నో వ్యయ ప్రయాసలకు ఓర్చి దీనిని విడుదల చేస్తున్నానని మధుసూదన్ తెలిపారు.ఈ రిలీజ్ డేట్ అనౌన్స్ మెంట్ ప్రెస్ మీట్ లో కృష్ణ పర్సనల్ మేకప్ మేన్ మాధవరావు, ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, రత్నమయ్య, గీత రచయిత బిక్కి కృష్ణ, ఖాదర్ గోరి, వాసిరెడ్డి స్పందన, ధీరజ అప్పాజీ, ఎం. శంకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ చిత్రానికి ఎం.ఎం. శ్రీలేఖ సంగీతం అందించారు.