Pushpa: రేవతి కుటుంబానికి 2 కోట్లు.. ప్రకటించిన పుష్ప టీమ్

Pushpa: సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు శ్రీతేజ్‌ను నిర్మాతలు దిల్‌ రాజు, అల్లు అరవింద్, పుష్ప ప్రొడ్యూసర్‌ ఎలమంచిలి రవి పరామర్శించారు. ఈ సందర్భంగా శ్రీతేజ్ తండ్రిని ఆదునిక వైద్యం గురించి వివరించి, ధైర్యం చెప్పారు.

ఈ ఘటనకు సంబంధించిన పరిహారంగా రూ. 2 కోట్లు అందజేస్తున్నట్లు అల్లు అరవింద్ వెల్లడించారు. ఇందులో అల్లు అర్జున్ తరపున రూ. 1 కోటి, అలాగే పుష్ప 2 నిర్మాతలు మరియు దర్శకుడు సుకుమార్ చెరో రూ. 50 లక్షలు అందజేయనున్నట్లు తెలిపారు.

ప్రస్తుతం శ్రీతేజ్ కిమ్స్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నాడు. బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం అందించడం ద్వారా నిర్మాతలు బాధ్యతాయుతంగా వ్యవహరించారు. ఈ చర్య వారికి ఆర్థిక భరోసా ఇవ్వడమే కాకుండా, మానవత్వాన్ని చాటింది.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Guava Juice: చలికాలంలో జామ రసం తాగితే.. మతిపోయే లాభాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *