SSMB29: సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘SSMB29’ సినిమా సినీ ప్రియుల్లో భారీ అంచనాలు రేకెత్తిస్తోంది. ఈ చిత్రంతో గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఇండియన్ సినిమాకు రీ-ఎంట్రీ ఇస్తుండటం విశేషం. ఈ సినిమాను తన కెరీర్‌లో ‘కమ్‌బ్యాక్’ కాదు, ‘హోమ్‌కమింగ్’ అని ప్రియాంక సంతోషంగా చెప్పారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె, “నేను హిందీ సినిమాలను, భారతీయ సినిమా వాతావరణాన్ని ఎంతగా మిస్ అయ్యానో వర్ణించలేను.
Also Read: Jai Hanuman: జై హనుమాన్ నుంచి స్పెషల్ ట్రీట్?
SSMB29: ఈ సినిమాతో తిరిగి భారతీయ సినిమాలో పనిచేయడం ఆనందంగా ఉంది” అని తెలిపారు. ఈ చిత్రంలో మహేష్ బాబుతో పాటు పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్, పాన్ వరల్డ్ స్థాయిలో విడుదల కానుంది.