Spicejet: చెన్నై నుండి హైదరాబాద్‌కు బయలుదేరిన స్పైస్‌జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ ఘటనతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివరాల్లోకి వెళ్తే, చెన్నై విమానాశ్రయం నుంచి హైదరాబాద్ బయలుదేరిన స్పైస్‌జెట్ విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక సమస్యను గుర్తించారు. దీంతో విమానాన్ని తిరిగి చెన్నై ఎయిర్‌పోర్ట్‌లోనే అత్యవసరంగా ల్యాండ్ చేశారు.
విమానం ల్యాండ్ అయిన తర్వాత సుమారు రెండు గంటల పాటు ప్రయాణికులు విమానం లోపలే ఉండిపోవాల్సి వచ్చింది. సాంకేతిక లోపం సరిదిద్దే పనులు జరుగుతున్నాయని సిబ్బంది చెప్పినప్పటికీ, ప్రయాణికులు చాలాసేపు వేచి చూడాల్సి వచ్చింది.
ఇటీవల తరచుగా విమానాల్లో ఇలాంటి సాంకేతిక లోపాలు తలెత్తుతుండటంతో ప్రయాణికులు ఆందోళన చెందుతున్నారు. విమానం ఎక్కాలంటేనే భయంగా ఉందని కొందరు ప్రయాణికులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. విమానయాన సంస్థలు ప్రయాణికుల భద్రతకు మరింత ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.