Pawan kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడిక్ నేపథ్యంలో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. చిత్ర నిర్మాణంలో చివరి భాగాన్ని నిర్మాత ఏఎం రత్నం తన కుమారుడు జ్యోతి కృష్ణ ద్వారా పూర్తి చేస్తున్నారు.
ఎన్నికల కారణంగా కొంత విరామం తీసుకున్న పవన్ కళ్యాణ్, ఇటీవల ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొన్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. కేవలం ఎనిమిది రోజుల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది.
గత కొన్ని రోజులుగా ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. నూతన సంవత్సరం కానుకగా హరిహర వీరమల్లు ఫస్ట్ సింగిల్ విడుదల తేదీని ప్రకటించారు. జనవరి 6న ఉదయం 9 గంటల 6 నిమిషాలకు “మాట వినాలి” అనే పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ పాటను స్వయంగా పవన్ కళ్యాణ్ ఆలపించడం ప్రత్యేక ఆకర్షణగా మారింది.
ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సూర్య మూవీస్ బ్యానర్‌పై ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, చిత్రాన్ని మార్చి 28న సమ్మర్ కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
పవన్ కళ్యాణ్ పోస్టర్‌ను కూడా తాజాగా విడుదల చేయడం అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపింది. హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన సినిమాగా నిలవనుందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి.