Sougat E Modi: ముస్లింలకు పరమ పవిత్రమైన ఈ రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ నెల 31న రంజాన్ పర్వదినాన్ని జరుపుకునేందుకు ముస్లిం మైనార్టీలు సిద్ధంగా ఉన్నారు. ఈ దశలో పేద ముస్లింలకు రంజాన్ తోఫా ఇచ్చేందుకు బీజేపీ ముందుకొచ్చింది. ఈ మేరకు ఆ పార్టీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది.
Sougat E Modi: ఇఫ్తార్ విందులతో దేశవ్యాప్తంగా ముస్లింలు సందడి చేస్తున్నారు. వారికి శుభాకాంక్షలు తెలుపుతూ అన్ని మతాల ప్రజలు పరమత సహనాన్ని ప్రదర్శిస్తున్నారు. దేశవ్యాప్తంగా కస్టమర్లతో దుకాణాలు సందడిగా మారాయి. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని 24 గంటలకు దుఖాణాలకు అనుమతులు ఇచ్చారు.
Sougat E Modi: దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేదల ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు 32 లక్షల కిట్లను తయారు చేసి ఉంచింది. ఈ మేరకు మార్చి 26న ఢిల్లీలో ఈ కిట్ల పంపిణీని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రారంభిస్తారు. సౌగాత్ ఈ మోదీ క్యాంపెయిన్ పేరుతో బీజేపీ మైనార్టీ మోర్చా ఈ కిట్లను అందజేయనున్నది. ఈ కిట్లలో పురుషులకు, స్త్రీలకు దుస్తులు, సేమియా, ఖర్జూరా, ఎండు ఫలాలు, చక్కెర, ఇతర పండ్లు ఉంటాయి.