Siddharth: తమిళ హీరో సిద్ధార్థ్ కు తెలుగులోనూ మంచి గుర్తింపు ఉంది. అతను నటించిన ‘మిస్ యు’ చిత్రం ఇటీవల తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలైంది. గతంలో సిద్ధార్థ్ కొన్ని తెలుగు సినిమాలలో పాటలు పాడారు. తాజాగా ‘ఇట్స్ ఓకే గురూ’ మూవీ కోసం ఆయన మరోతెలుగు పాటను పాడారు. చరణ్ సాయి, ఉషశ్రీ జంటగా నటిస్తున్న ఈ సినిమాను సురేశ్ అనపురపు, బస్వ గోవర్థన్ గౌడ్ నిర్మించారు. మణికంఠ ఎం దీనిని డైరెక్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: E Sala cup namde: ఈ సాలా కప్ నామ్దే అంటున్న అభిమానులు! మరి ఈ జట్టు తో సాధ్యమేనా
Siddharth: ఈ సినిమాలోని ‘నా శ్వాసే నువ్వే’ అనే పాటను సిద్ధార్థ్ పాడగా, లిరికల్ వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. రాహుల్ రెడ్ ఇన్ఫినిటీ రాసిన ఈ పాటను మోహిత్ రెహ్మానియక్ కంపోజ్ చేశారు. ప్రేమలోని ఆర్ధ్రతను తెలియచేస్తూ సిద్ధార్థ్ దీనిని పాడారు. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.