Abdul Rehman Makki: ముంబై దాడుల సూత్రధారి అబ్దుల్ రెహ్మాన్ మక్కీ శుక్రవారం గుండెపోటుతో మరణించాడు. గత కొన్ని రోజులుగా మక్కీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటీవల కాలంలో అతనికి షుగర్ ఎక్కువ కావడంతో లాహోర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అబ్దుల్ మక్కీ ఉగ్రవాది హఫీజ్ సయీద్ బంధువు, ఉగ్రవాద సంస్థ జమాత్-ఉద్-దవా డిప్యూటీ చీఫ్ కూడా. 2020లో, తీవ్రవాద కార్యక్రమాల ఆరోపణలతో కోర్టు అతనికి 6 నెలల జైలు శిక్ష విధించింది. శిక్ష తర్వాత అతను లో ప్రొఫైల్ లో ఉంటూ అజ్ఞాతంలో జీవిస్తున్నాడు. 2023లో ఐక్యరాజ్యసమితి అతడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.
అబ్దుల్ రెహమాన్ మక్కీని హఫీజ్ అబ్దుల్ రెహ్మాన్ మక్కీ అని కూడా అంటారు. అతను 1954లో పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్‌లోని బహవల్‌పూర్‌లో జన్మించాడు. హఫీజ్ సయీద్‌తో మక్కీ చాలా కాలంగా సన్నిహితంగా ఉన్నాడు.
ఇది కూడా చదవండి: Karnataka: మా అత్తగారు త్వరగా చనిపోవాలి.. ఏకంగా అమ్మవారికి అర్జీ
Abdul Rehman Makki: అతను లష్కర్, జమాత్ ఉద్ దవాలో అనేక ముఖ్యమైన పదవులను నిర్వహించాడు. పొలిటికల్ చీఫ్, లష్కర్ కోసం నిధుల సేకరణ వంటి పనులను కూడా మక్కీ నిర్వహించాడు. అతను లష్కర్ పాలకమండలి అయిన షురా సభ్యుడు కూడా.
2000లో ఎర్రకోటపై, 2008లో ముంబైలోని తాజ్ హోటల్‌పై జరిగిన ఉగ్రవాద దాడుల్లో మక్కీని భారత ఏజెన్సీలు నిందితుడిగా పరిగణించాయి. US ఆర్థిక శాఖ 2010లో అతన్ని స్పెషల్ డిజిగ్నేటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చింది.