Shamshabad Airport: హైదరాబాద్ శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఈ రోజు బుధవారం ఉదయం తిరుపతి వెళ్లాల్సిన విమానం సాంకేతికలోపంతో నిలిచిపోయింది. ఉదయం 5.30 గంటలకు బయలుదేరాల్సిన విమానం ఆలస్యంపై చివరి నిమిషయంలో ప్రయాణికులకు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో ఉదయం నుంచి ఇప్పటి వరకూ ప్రయాణికులు పడిగాపులు కాస్తున్నారు.
Shamshabad Airport: తిరుపతి వెళ్లాల్సిన విమానం 9.40 గంటల వరకూ విమానం కదలలేదు. ఆలస్యంలో సమాచారలోపంపై ప్రయాణికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారుల తీరు పట్ల వారంతా ఆందోళన చేస్తున్నారు. నాలుగు గంటలు దాటినా ఎలాంటి అప్‌డేట్స్ లేకపోవడంతో ప్రయాణికులు గగ్గోలు పెడుతున్నారు.