Emergency Landing: హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుండి తిరుపతి వెళ్లే అలయన్స్ ఎయిర్‌లైన్స్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో, పైలట్ అప్రమత్తమై వెంటనే ATC (Air Traffic Control) కేంద్రానికి సమాచారం అందించాడు. విమానం వైఎస్ఆర్ జిల్లా ఒంటిమిట్ట సమీపంలో ఉన్నప్పుడే పైలట్ సమస్యను గుర్తించడంతో, అత్యవసర ల్యాండింగ్‌కు అనుమతి కోరాడు.
